ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి.. రావుల

 

రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్రా రాష్ట్రానికి ఆర్ధిక లోటు ఉండగా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మిగులు బడ్జెట్ తో లాభం పొందింది. కానీ ఇప్పుడు పరిస్థితి మాత్రం తిరగబడింది. తెలంగాణకు ప్రస్తుతం బడ్జెట్ లేదని.. తెలంగాణ ఖజానా ఖాళీ అయిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయంపై తెలంగాణ టీ.డీడీపీ నేతలు కేసీఆర్ పై మండిపడ్డారు. రాష్ట్రం మిగులు బడ్జెట్‌లో ఉందంటూనే బిల్లులన్నీ పెండింగ్‌లో పెడుతున్నారని రమణ ఆరోపించారు. అసలు వేతనాలు చెల్లించడానికే డబ్బులు లేవుకాని ఆకాశ హార్మ్యాలు అంటూ కోతలు కోస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని రావుల చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.