అబ్దుల్ కలాం లాస్ట్ ట్వీట్

 

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం షిల్లాంగ్ ఐఐఎం సమావేశంలో ప్రసంగిస్తూనే కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి యావత్ భారతదేశం దిగ్ర్భాంతికి గురైంది. ఎంతో మందికి ఆదర్శవంతంగా నిలిచిన అబ్దుల్ కలాం మరణించడంతో దేశం ఒక్కసారిగా మూగబోయింది. కలాం మృతికి ఎంతోమంది సంతాపం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ నరసింహన్ ఇరు రాష్ట్రాల సీఎంలు తమ విచారాన్ని వ్యక్తం చేశారు. ఆయన మరణం కేవలం భారత్‌కే కాకుండా యావత్ ప్రపంచానికే తీరని లోటన్నారు. అనేక మంది ట్వీట్లతో తమ సంతాపాన్ని తెలిపారు. కానీ అబ్దుల్ కలాం చేసిన చివరి ట్వీట్ ఎంటో తెలుసా..

 

అబ్దుల్ కలాం చివరి ట్వీట్.. 'నివాసయోగ్యమైన గ్రహం భూమి' అనే అంశంపై మాట్లాడేందుకు షిల్లాంగ్ ఐఐఎం వెళ్తున్నానని, శ్రీజన్ పాల్ సింగ్, శర్మ కూడా వస్తున్నారని ఆయన ట్వీట్ చేశారు.

 

కాగా కలాం మరణంతో ఆయన జన్నస్థలమైన రామేశ్వరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రామేశ్వరంలోనే ఉంటున్న కలాం అన్నయ్య ముత్తుమీరా లెబ్బాయ్ మరైకర్ తమ్ముడి మరణ వార్త విని కన్నీరుమున్నీరు అయ్యారు. తన తమ్ముడ్ని చూపించాలని బోరున ఏడ్చారు.