30 కోట్ల ఘరానా మోసం

 

ఈరోజుల్లో యువతరానికి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేయాలన్న తహతహ పెరిగిపోయింది. సరైన సంస్థల్లో మంచి ఉద్యోగాలు పొందే వారు ఎంతమంది వున్నారో, బోగస్ సంస్థలను ఆశ్రయించి మోసపోయే సాఫ్ట్‌వేర్ యూత్ కూడా అంతమంది వున్నారు. తాజాగా బెంగళూరులో సాప్ట్వేర్ ఉద్యోగాల పేరుతో అంజాద్ పర్వేజ్ అనే మోసగాడు నిరుద్యోగులకు భారీగా టోకరా వేశాడు. యాహూలో ఉద్యోగాలు ఇప్పించేస్తానని అతగాడు వేలాదిమంది నిరుద్యోగులకు టోపీ పెట్టాడు. తానుమాత్రం 30 కోట్లు దండుకుని బిచాణా ఎత్తేశాడు. ఈ మోసగాడు హిందూపూర్‌కి చెందినవాడు కావడంతో బాధితులు హిందూపూర్ పోలీసులను ఆశ్రయించారు.