విజయనిర్మల మృతికి రాజకీయ సంతాపం

నిన్న రాత్రి సమయంలో సూపర్ స్టార్ కృష్ణ రెండో భార్య, దర్శక - నటి విజయనిర్మల హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె నిన్న రాత్రి హార్ట్ ఎటాక్ కి గురయ్యి కన్ను మూసారు. ఆమె మృతికి టాలీవుడ్ మొత్తం దిగ్బ్రాంతికి లోనయ్యింది. ఇప్పటికే ఆమె పార్ధివ దేహాన్ని చూసేందుకు ప్రముఖులు కృష్ణ ఇంటికి చేరుతున్నారు. అయితే ఆమె మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా తమ సంతాపాన్ని తెలియచేశారు. ముందుగా ఆమె మృతికి ఏపీ సీఎం సంతాపం తెలియచేశారు ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నీస్ బుక్ రికార్డు సాధించిన మేటి దర్శకురాలైన విజయనిర్మల మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటని ఆయన పేర్కొన్నారు. మరోపక్క విజ‌య నిర్మ‌ల మృతి ప‌ట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆమె ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని ప్రార్దించారు. ఇక ఆమె మృతికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ తదితరులు కూడా తమ సంతాపాన్ని ప్రకటించారు. ఇక విజయనిర్మల మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  బాల నటిగా సినిమా రంగంలోకి ప్రవేశించి ఉన్నత శిఖరాలను అధిరోహించారని కొనియాడారు. తెలుగు సినిమా రంగంలో మహిళల ప్రాధాన్యత పెంచిన ఘనత విజయనిర్మలకు దక్కుతుందని పేర్కోన్నారు. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె నిన్న అర్థరాత్రి కన్నుమూశారు. ఇక విజ‌య నిర్మ‌ల అంత్య‌క్రియ‌లు రేపు ఉద‌యం మ‌హా ప్ర‌స్థానంలో జ‌ర‌గ‌నున్నాయి. ఇక ఇదే విషయం