ఎంసెట్‌లో అర్హుల శాతాలివే...

 

ఇంజనీరింగ్ - 77.4 శాతం అర్హులు

ఇంజనీరింగ్ విభాగంలో 77.4 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ విభాగంలో కె.అనిరుధ్ రెడ్డి 157 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచినట్టు మంత్రి తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో వి.అచ్యుత్ రెడ్డికి రెండో స్థానం, ఆహ్వానరెడ్డికి మూడో స్థానం లభించిందని తెలిపారు.

 

మెడిసిన్‌ - 89.89 శాతంఅర్హులు

ఎంసెట్ మెడిసిన్ విభాగంలో 89.89 శాతం మంది అర్హత సాధించినట్టు ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. కె.శ్రీవిద్యుల్ (హైదరాబాద్)కి ప్రథమ ర్యాంక, సాయి భరద్వాజ్ రాళ్ళబండికి రెండో ర్యాంకు, శ్రీరామ దామినికి మూడో ర్యాంకు లభించాయి. జూన్ 12 నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. మూడు నాలుగు రోజుల్లో మెడిసిన్ కౌన్సిలింగ్ తేదీలు ప్రకటిస్తామని మంత్రులు తెలిపారు.