అబ్దుల్ కలాం మృతికి ఏపీ అసెంబ్లీ నివాళి
posted on Aug 31, 2015 11:10AM
భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాంకు ఏపీ అసెంబ్లీ ఘనంగా నివాళి అర్పించింది. సంతాప తీర్మానాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ప్రవేశ పెట్టారు. ఆయన ఆశయ సాధన కోసం పనిచేయాలని సూచించారు. రాష్ట్రపతి పదవికి గౌరవం తెచ్చిన వ్యక్తి కలాం అన్నారు. యువతలో స్ఫూర్తి నింపేందుకు కలాం ప్రయత్నించారని బాబు తెలిపారు. ఒంగోలులో ట్రిపుల్‌ఐటీకి అబ్దుల్‌కలాం పేరు పెడతాం ప్రకటించారు. చదువుల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అబ్దుల్‌కలాం పేరుతో పురస్కారాలు అందజేయనున్నట్లు తెలిపారు.
భరతమా ముద్దుబిడ్డ అబ్దుల్ కలాం అని ప్రతిపక్ష నేత జగన్ పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం కలాం మృతికి సంతాప తీర్మానం ప్రవేశ పెట్టింది. ఈ సందర్భంగా జనగ్ ప్రసంగించారు. ఆయన మృతి చెందడం తనకే కాకుండా దేశాన్ని కలిచివేసిందన్నారు. అబ్దుల్‌కలాం సాధారణ జీవితం గడిపారని చెప్పారు. రాష్ట్రపతి పదవి అనంతరం ఉపాధ్యాయుడిగా జీవితం కొనసాగించారని జగన్ అన్నారు.