వాస్తు శాస్త్రీయం

(Vastu is Scientific)

 

వాస్తు గురించి అనేక తర్జనభర్జనలు ఉన్నాయి. "ఈ వాకిలి ఇటువైపే ఎందుకు ఉండాలి, మరోవైపు ఎందుకు ఎండకూడదు..", "వంటిల్లు ఆగ్నేయం దిశలో లేకపోతే ఏమౌతుంది" - లాంటి వాదాలు అనేకం వింటూ ఉంటాం. "ఇండిపెండెంట్ ఇల్లయితే, సరే కావలసినట్లు కట్టించుకోవచ్చు, కానీ ఫ్లాట్స్ లో వాస్తు ఎలా సాధ్యం?!" అని తల పంకించేవాళ్ళు, "ఆఫీసుల్లో చెప్పిన చోట కూర్చుని పని చేయడం లేదూ.. అక్కడ కూడా వాస్తు గురించి మాట్లాడితే ఉద్యోగం ఊడుతుంది" - అని ఛలోక్తులు విసిరేవాళ్ళు, "ఇంకా నయం, రైల్లో కూడా ఈ డైరెక్షన్లోనే వెళ్తాను అంటారేమో" - అంటూ జోకులు వేసేవాళ్ళు ఎదురౌతుంటారు.

రోజంతా పనుల వత్తిడితో నలిగిపోయి, విసిగిపోయిన మనం, ఏదో వంకన కాసేపు కులాసాగా నవ్వుకోడానికి చూస్తాం. అలాంటి చతురోక్తులకు వాస్తు కూడా ఒక టాపిక్ అయితే పరవాలేదు. కానీ వాస్తును చప్పరించి, తీసిపారేస్తే, ఆనక మనమే బాధపడాల్సి వస్తుంది. ఏది ఎటువైపు ఉండాలో, అది అటువైపే గనుక ఉంటే మేలు జరుగుతుంది. ఉండకూడని వైపు కిటికీలు, దర్వాజాలు గట్రా వాస్తు విరుద్ధంగా ఉంటే ఫలితాలు నెగెటివ్ గానే ఉంటాయి.

భూమికి ఆకర్షణ శక్తి ఉంది. భూమి తనచుట్టూ తాను తిరుగుతుంది, సూర్యుని చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది. ఈ నేపథ్యంలో భూమి చుట్టూ ఉండే గ్రహాలూ, నక్షత్రాల ప్రభావం భూమి మీద పడుతుంటుంది. అందుకే ప్రతిదానికీ "ఇదిలా ఉండాలి" అంటూ నియమాలు నిర్దేశించారు. ఆ నియమాలను పాటిస్తే సత్ఫలితాలు ఉంటాయి.


More Vastu