స్నేహితునితో పాటుగానే

 

అనఘునికైనఁజేకుఱు ననర్హుని గూడి చరించినంతలో

మన మెరియంగ నప్పుఁడవమానము కీడుధరిత్రియందు నే

యనువుననైనఁదప్పవు యథార్థము తానది యెట్టులన్నచో

నినుమునుగూర్చి యగ్ని నలయింపదె సమ్మెటపెట్టు భాస్కరా!నిప్పుకి ఎలాంటి దోషమూ అంటదని, అది పవిత్రమైనదనీ అంటారు. కానీ వేడి వేడి ఇనుముతో పాటుగా ఉన్న నిప్పుకి కూడా సమ్మెట దెబ్బ తగలక మానదు. అలాగే పనికిమాలినవారితో స్నేహం చేసినప్పుడు మనకి కూడా ఈ లోకంలో అవమానము, కీడు కలగక తప్పవు.


More Good Word Of The Day