Home » Beauty Care » వయసు 50 దాటినా, యంగ్ లుక్ సాధించడం ఎలా.. కొల్లాజెన్ బూస్టింగ్ టిప్స్.

వయసు 50 ఏళ్లు దాటుతున్న కొద్దీ చర్మంలో మార్పులు రావడం సహజం. మన శరీరంలో కొలాజెన్, ఎలాస్టిన్ ఉత్పత్తి క్రమంగా తగ్గిపోవడంతో చర్మం బిగుతుదనాన్ని కోల్పోయి ముడతలు పడటం, సాగిపోవడం ప్రారంభమవుతుంది. అయితే సరైన సంరక్షణ, పోషకాహార నియమాలు పాటిస్తే వయసు పెరిగినా చర్మాన్ని కాంతివంతంగా, దృఢంగా ఉంచుకోవచ్చని ప్రసిద్ధ సెలబ్రిటీ మెడికల్ ఆస్థెటిక్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీ సత్య జగదీష్ వివరించారు.

చర్మ ఆరోగ్యంలో 30 శాతం బాహ్య సంరక్షణపై ఆధారపడితే, మిగిలిన 70 శాతం మనం తీసుకునే ఆహారం మరియు జీవనశైలిపైనే ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజూ తగినంత నీరు తాగుతూ చర్మ కణాలను హైడ్రేటెడ్‌గా ఉంచడం మొదటి ప్రాథమిక సూత్రం. రోజువారీ సంరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ pH 5.5 స్థాయి కలిగిన జెంటిల్ క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. క్లెన్సర్‌లో సాలిసిలిక్ యాసిడ్ (BHA) లేదా నియాసినమైడ్ వంటివి ఉంటే చర్మం మరింత ప్రకాశవంతంగా మారుతుంది.

18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉన్నా లేదా బయటకు వెళ్లినా విటమిన్ UVA, UVB ప్రొటెక్షన్ ఇచ్చే SPF 50 PA+++ సన్ స్క్రీన్‌ను తప్పనిసరిగా వాడాలి. మనం రాత్రివేళల్లో చీకటి గదిలో మొబైల్ వాడటం వల్ల వచ్చే బ్లూ లైట్ కూడా చర్మాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. మనదేశంలో సన్ స్క్రీన్‌ల అతిగా వాడకం, కేవలం ఇండోర్స్‌కే పరిమితం కావడం మరియు రసాయన సోప్‌ల వల్ల చర్మంపై ఉండే మైక్రోబయోమ్ నశించి భారతదేశంలో 99 శాతం మంది ప్రజలు విటమిన్ D లోపంతో బాధపడుతున్నారు. అందువల్ల ఫోటోబయో టెక్నాలజీ కలిగిన సన్ స్క్రీన్‌లను ఎంచుకోవడం ఎంతో మేలు చేస్తుంది.

50 ఏళ్ల తర్వాత చర్మానికి తేమ అందించడం చాలా కీలకమైన అంశం. మన చర్మంలోని 70 శాతం భాగం లిపిడ్స్‌తో నిర్మితమై ఉంటుంది. కాబట్టి సెరమైడ్స్ (సెరాఫిలిక్ NP, సెరాఫిలిక్ AP) మరియు 6 లేదా 12 కాంప్లెక్స్ పెప్టైడ్స్ ఉన్న మాయిశ్చరైజర్‌ను ఉపయోగించాలి. సెరమైడ్స్ ఒక సిమెంట్ లాగా పనిచేసి చర్మంలోని తేమ బయటకు పోకుండా కాపాడితే, పెప్టైడ్స్ కణాల మరమ్మతుకు అవసరమైన సిగ్నలింగ్‌ను మెరుగుపరుస్తాయి. రాత్రివేళల్లో రెటినాల్ క్రీమ్ వాడటం వల్ల సెల్ టర్నోవర్ పెరుగుతుంది. ఐసోమాయిస్ట్ లేదా పెంటావిటిన్ వంటి కొత్త మాలిక్యూల్స్ ఉన్న క్రీమ్స్ వాడితే చర్మానికి ఏకంగా 72 గంటల పాటు నిరంతర హైడ్రేషన్ లభిస్తుంది.

అంతర్గత ఆరోగ్యం కోసం 1:2:2 నిష్పత్తి డైట్ ఫార్ములాను పాటించాలి. ఒక భాగం కార్బోహైడ్రేట్లు (అన్నం) తీసుకుంటే, దానికి రెట్టింపుగా రెండు భాగాలు ప్రోటీన్ (గుడ్లు లేదా చికెన్) మరియు రెండు భాగాలు ఫైబర్ కలిగిన కూరగాయలు తీసుకోవాలి. క్యాప్సికం, క్యారెట్, బీట్‌రూట్, బీన్స్ వంటి రంగురంగుల కూరగాయలలోని యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుండి చర్మాన్ని రక్షిస్తాయి. ఒమేగా-3, జింక్, విటమిన్ C ఉన్న ఆహారం కొలాజెన్ సంశ్లేషణను పెంచి చర్మంపై ముడతలు రాకుండా నిరోధిస్తుంది. ముడతలు ఇప్పటికే ఎక్కువగా వస్తే క్లినికల్ ప్రొసీజర్స్ వైపు వెళ్లాల్సి ఉంటుంది, కానీ ఈ నియమాల ద్వారా ఫ్యూచర్ డామేజ్‌ను సమర్థవంతంగా అడ్డుకోవచ్చు.

 

 

Wrinkle free skin after 50,  glowing skin secrets Telugu, anti aging skincare tips, beauty secrets.


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.