Home » Beauty Care » ముఖం మీద మచ్చలను మాయం చేసే సూపర్ టిప్ ఇది..!
ముఖం మీద మచ్చలను మాయం చేసే సూపర్ టిప్ ఇది..!

అందమైన ముఖాన్ని కూడా ఎబ్బెట్టుగా కనిపించేలా చేయడంలో ముఖం మీద మచ్చలు, గీతలు, మొటిమలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ మచ్చలు లుక్స్ ను చాలా ప్రబావింత చేస్తాయి. ఎండ తీవ్రత ఎక్కువ పడటం, మొటిమలు, పిగ్మెంటేషన్, హార్మోన్ల మార్పులు, స్కిన్ కేర్ సరిగా ఫాలో కాకపోవడం వంటి తప్పుల వల్ల ముఖం మీద మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు పోగొట్టుకోవడానికి మార్కెట్లో దొరికే ఖరీదైన ఉత్పత్తులు వాడుతుంటారు. కానీ వీటి వల్ల ఆశించిన ఫలితాలు అయితే ఉండవు. ఈ మచ్చలు తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో లభించే కొన్ని నేచురల్ పదార్థాలు, ఇంటి చిట్కాలు చర్మపు రంగును సహజంగా మెరుగుపరిచి మచ్చలు తగ్గేలా చేస్తాయి. చర్మానికి మెరుపును ఇస్తాయి. క్రమం తప్పకుండా వీటిని వాడితే చాలా గొప్ప ఫలితాలు కనిపిస్తాయి. ఇంతకీ మచ్చలను తగ్గించే ఆ సూపర్ టిప్ ఏంటో తెలుసుకుంటే..
మచ్చలను తగ్గించే మ్యాజిక్ క్రీమ్..
మచ్చలను తగ్గించడంలో ఇంట్లోనే తయారు చేసే క్రీమ్ చాలా బాగా సహాయపడుతుంది.
కావలసిన పదార్థాలు..
అలోవెరా జెల్.. 1 స్పూన్
నిమ్మరసం.. అరటీ స్పూన్
రోజ్ వాటర్.. ఒక టీస్పూన్..
తయారు విధానం..
ఒక చిన్న కంటైనర్ తీసుకుని అందులో ఒక స్పూన్ అలోవెరా జెల్ వేయాలి. అందులో ఒక అర స్పూన్ నిమ్మరసం వేయాలి. అందులోకే ఒక స్పూన్ రోజ్ వాటర్ కూడా వేయాలి. ఈ మూడు పదార్థాలను బాగా మిక్స్ చేయాలి. ఇది క్రీమీగా మారుతుంది.
అలోవెరా జెల్ చర్మాన్ని రిపేర్ చేయడానికి, మచ్చలను లైట్ గా చేసి అవి తగ్గడానికి సహాయపడుతుంది.
నిమ్మరసం సహజ బ్లీజ్ గా పనిచేస్తుంది. ఇది పిగ్మెంటేషన్ ను తగ్గిస్తుంది.
రోజ్ వాటర్ చర్మాన్ని కూల్ గా మారుస్తుంది. చర్మాన్ని తేమగా మృదువుగా మారుస్తుంది.
ఎలా ఉపయోగించాలి?
మొదటగా ముఖాన్ని మంచి ఫేస్ వాష్ తో క్లీన్ చేసుకోవాలి. ఆ తరువాత ముఖాన్ని పొడి టవల్ తో బాగా తుడుచుకోవాలి. ఇలా చేసిన తరువాత తయారు చేసుకున్న క్రీమ్ ను చేతి వేళ్లతో కొద్దిగా తీసుకుని ముఖం మీద మచ్చలు ఉన్న ప్రాంతంలో సున్నితంగా అప్లై చేయాలి. 15 నుండి 20 నిమిషాల వరకు అలాగే ఉంచాలి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని సాధారణ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. మంచి ఫలితాల కోసం ఈ క్రీమ్ ను వారానికి 3 నుండి 4 సార్లు ఉపయోగించాలి.
జాగ్రత్త..
ఈ క్రీమ్ లో నిమ్మరసం ఉంటుంది. ఇది సున్నితమైన చర్మం ఉన్నవారికి చాలా చికాకు కలిగిస్తుంది. అందుకే దీన్ని ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయాలి. ఈ క్రీమ్ ను అప్లై చేసినప్పుడు మంట, దురద, లేదా చర్మం ఎర్రగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తే వాడటం మానేయాలి. ఈ క్రీమ్ చర్మానికి ఎలాంటి హాని కలిగించకపోతే దీన్ని ఉదయం సమయాల్లో కంటే రాత్రి సమయంలో అప్లై చేయడం మంచిది. రాత్రి సమయంలో దీన్ని ముఖానికి అప్లై చేసి అలాగే వదిలేయవచ్చు.
పైన పేర్కొన్న క్రీమ్ ను రెగ్యులర్ గా వాడుతుంటే ముఖం మీద మచ్చలు మెల్లిగా తేలిక అవుతాయి. కలబంద చర్మాన్ని లోపలి నుండి పోషణ ఇస్తుంది. కొత్త చర్మ కణాల ఏర్పాటును ప్రోత్సహిస్తుంది. నిమ్మరసం చర్మం రంగును సమంగా చేస్తుంది. రోజ్ వాటర్ ముఖాన్ని తాజాగా, ప్రకాశవంతంగా ఉంచుతుంది. కొన్ని వారాలు ఈ క్రీమ్ వాడితే చర్మం మీద స్పష్టమైన మార్పు కనిపిస్తుంది.
*రూపశ్రీ.
