Home » Beauty Care » మెరిసే చర్మానికి అద్బుతమైన ఇంటి రెమిడీ.. దీని ముందు బ్యూటీ పార్లర్లు బలాదూర్!
మెరిసే చర్మానికి అద్బుతమైన ఇంటి రెమిడీ.. దీని ముందు బ్యూటీ పార్లర్లు బలాదూర్!

అందంగా, ఆరోగ్యంగా, మెరిసే చర్మం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇందు కోసం అమ్మాయిలు మార్కెట్లో లభించే ఉత్పత్తుల నుండి బ్యూటీ పార్లర్ ట్రీట్మెంట్ వరకు ప్రతీది ట్రై చేస్తారు. అయితే ఇవన్నీ తాత్కాలిక ఫలితాన్ని ఇవ్వడం లేదా అసలు ఫలితాన్ని ఇవ్వకపోవడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా కొన్ని యాడ్స్ చూసి వాడిన మార్కెట్ ఉత్పత్తులు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇస్తుంటాయి. కానీ ఎన్ని అనుభవాలు ఎదురైనా అమ్మాయిలు తమ అందం కోసం ఏదో ఒకటి ప్రయోగిస్తూనే ఉంటారు. అవన్నీ వదిలేసి కేవలం ఒకే ఒక్క ఉత్పత్తి వాడటం వల్ల చాలా గొప్ప ఫలితాన్ని పొందవచ్చు. చర్మాన్ని అటు మెరిపిస్తూ, ఇటు అందంగా ఆరోగ్యంగా ఉంచే అద్బుతమైన ఇంటి రెమిడీ ఒకటుంది. అదేంటో.. దాన్ని ఎలా వాడాలో తెలుసుకుంటే..
హోమ్ మేడ్ కాఫీ స్క్రబ్..
హోమ్ మేడ్ కాఫీ స్క్రబ్ తయారు చేసుకోవడం చాలా సులువు. అలాగే వాడటం కూడా కష్టమేం కాదు. దీనికి కావలసిన పదార్థాలు..
½ కప్పు కాఫీ పొడి
1/2 కప్పు చక్కెర
¼ కప్పు కొబ్బరి నూనె
1-2 టేబుల్ స్పూన్లు తేనె
1 టేబుల్ స్పూన్ మైల్డ్ బాడీ వాష్
తయారీ విధానం..
కాఫీ స్ర్కబ్ తయారు చేయడానికి కనీసం స్టౌ కూడా అవసరం లేదు. ఒక శుభ్రమైన పొడిగా ఉన్న ఖాళీ సీసా తీసుకోవాలి. ఇందులో కాఫీ పౌడర్ వేయాలి. అందులోనే చక్కెర, కొబ్బరి నూనె, తేనె వేయాలి. అన్నింటిని బాగా మిక్స్ చేయాలి. అందులో ఒక స్పూన్ మైల్డ్ బాడీ వాష్ కలపాలి. ఈ పదార్థాలు అన్నీ బాగా కలిపితే అద్బుతమైన స్క్రబ్ తయారైనట్టే..
కాఫీ స్క్రబ్ ఎలా వాడాలి?
కాఫీ స్క్రబ్ ఉపయోగించడానికి పెద్ద శ్రమ పడక్కర్లేదు. మొదట చర్మాన్ని శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత స్క్రబ్ మిశ్రమాన్ని తడి చర్మానికి అప్లై చేయాలి. వృత్తాకారంగా రుద్దుతూ సున్నితంగా స్క్రబ్ చేయాలి. ఇది పొడి చర్మం, టానింగ్ నుండి ఉపశమనం కలిగిస్తుంది . బాగా స్ర్కబ్ చేసుకున్న తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. మళ్లీ ఎలాంటి సోప్ లేదా లిక్విడ్ వాష్ లాంటివి వాడకూడదు. ఈ స్క్రబ్ వాడుతుంటే చర్మం చిన్న పిల్లల్లా ఎంతో స్మూత్ గా, తాజాగా మారుతుంది. పైన చెప్పుకున్న కొలతలలోనే కాకుండా కొద్ది మొత్తంలో కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు.
కాఫీ స్ర్కబ్ ఎలా పని చేస్తుంది..
ఇంట్లో తయారు చేసుకున్న కాఫీ స్ర్కబ్ అనేక చర్మ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. కాఫీ పౌడర్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. చక్కెర చర్మాన్ని మృదువుగా చేయడానికి సహాయపడుతుంది. కొబ్బరి నూనె చర్మానికి పోషకాలను అందిస్తుంది, తేనె చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. చివరగా, బాడీ వాష్ చర్మం నుండి మలినాలను తొలగించడానికి సహాయపడుతుంది.
*రూపశ్రీ.
