Home » Home and Career » ఎంత ప్రయత్నం చేసినా వంటింట్లో బొద్దింకలు పోవడం లేదా..ఈ పవర్పుల్ టిప్స్ ట్రై చేయండి..!

బొద్దింకలు చాలామంది ఇళ్లలో చాలా పెద్ద సమస్యగా ఉంటాయి. ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా బొద్దింకలు ఎందుకు వస్తున్నాయో అని చాలామంది గందరగోళానికి గురవుతూ ఉంటారు. బొద్దింకలు ఇంటిని గందరగోళం చేయడమే కాకుండా వాటి కారణంగా ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. చాలామందిలో అలర్జీలు, ఆస్తమా కు కూడా కారణం అవుతాయి. అయితే బొద్దింకలను వదిలించుకోవడానికి ఖరీదైన క్రిమి సంహారకాలు వాడుతుంటారు. దీనివల్ల బొద్దింకలు చావడం అటుంచితే.. ఇంటి సభ్యుల ఆరోగ్యానికి కూడా ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది. కొన్ని సింపుల్ టిప్స్ తో బొద్దింకలను ఎలా వదిలించుకోవాలో తెలుసుకుంటే..
ఈ విషయం గుర్తుంకోవాలి..
బొద్దింకలు సాధారణంగా రాత్రిపూట చాలా చురుకుగా ఉంటాయి. అవి తేమ, చీకటి , చిన్న ఆహార కణాల పట్ల ఎక్కువగా ఆకర్షింపబడతాయి. అందుకే అవి సింక్‌ల కింద, గ్యాస్ స్టవ్‌ల వెనుక, వంటగది క్యాబినెట్‌లలో, డ్రెయిన్‌లలో , రిఫ్రిజిరేటర్ చుట్టూ సులభంగా దాక్కుంటాయి. అందువల్ల, వంటగదిని శుభ్రంగా ఉంచడం, నీటి లీక్‌లు లేకుండా చూసుకోవడం, ఆహారాన్ని ఎల్లప్పుడూ గాలి చొరబడని డబ్బాలలో నిల్వ చేయడం చాలా ముఖ్యం.
బొద్దింకలను ఎలా తరిమేయవచ్చు..?
బేకింగ్ సోడా , చక్కెర మిశ్రమం బొద్దింకలను తరిమివేయడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ రెండు పదార్థాలను సమాన పరిమాణంలో కలిపి, బొద్దింకలు తరచుగా వచ్చే ప్రదేశాలలో ఉంచాలి. చక్కెర వాటిని ఆకర్షిస్తుంది, అయితే బేకింగ్ సోడా వాటి శరీరంపై పనిచేసి, వాటిని నిర్మూలించడంలో సహాయపడుతుంది. దీని ప్రభావం కొనసాగడానికి, ఈ మిశ్రమాన్ని ప్రతి కొన్ని రోజులకు మార్చాలి
ఫుడ్ గ్రేడ్ డయాటోమేషియస్ ఎర్త్ ..
ఫుడ్ గ్రేడ్ డయాటోమేషియస్ ఎర్త్ కూడా ఒక మంచి ఎంపిక. ఇది ఒక సహజమైన పొడి, ఇది బొద్దింకల శరీరం యొక్క బయటి పొరను దెబ్బతీసి, వాటిని క్రమంగా చంపుతుంది. దీనిని ఎల్లప్పుడూ పొడి ప్రదేశాలలో చల్లాలి, తేమ ఉన్న చోట దీన్ని చల్లితే తేమ కారణంగా ఈ పొడి పవర్ తగ్గుతుంది.
ఇవి కూడా పాటించవచ్చు..
ఫుడ్ గ్రేడ్ డయాటోమేషియస్ ఎర్త్
పుదీనా, టీ ట్రీ లేదా యూకలిప్టస్ వంటి సుగంధ నూనెలు కూడా ఉపయోగపడతాయి. ఈ నూనెలలో కొన్ని చుక్కలను ఒక స్ప్రే బాటిల్‌లో వేసి అందులో నీటితో కలిపి, వంటగది మూలలు, సందులు , డ్రెయిన్‌ల చుట్టూ చల్లాలి. వాటి ఘాటైన వాసన బొద్దింకలను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. బిర్యానీ ఆకులు కూడా ఒక సులభమైన ఇంటి చిట్కా. ఎండిన బిర్యానీ ఆకులను కొద్దిగా నలిపి, వాటిని అల్మారాలు, డ్రాయర్లు , నిల్వ ప్రదేశాలలో ఉంచాలి.. బొద్దింకలకు వాటి వాసన నచ్చదు , అవి ఈ ప్రదేశాలకు దూరంగా ఉంటాయి. వైట్ వెనిగర్ కలిపిన నీటితో కిచెన్ కౌంటర్ ను శుభ్రపరచడం వల్ల జిడ్డు , చిన్న చిన్న మరకలు, వంటివి తొలగిపోతాయి, ఇది బొద్దింకల బెడదను తగ్గిస్తుంది.
*రూపశ్రీ.

