Home » Fashion » ఈ మూడు స్టెప్స్ ఫాలో అయితే చాలు .. ఎన్నేళ్ళయినా ఆభరణాల మెరుపు చెక్కు చెదరదు..
ఈ మూడు స్టెప్స్ ఫాలో అయితే చాలు .. ఎన్నేళ్ళయినా ఆభరణాల మెరుపు చెక్కు చెదరదు..
ఆభరణాలు భారతీయ మహిళలకు ఎంతో ఉష్టమైనవి. నిజం చెప్పాలంటే చాలామంది మహిళలు ఆభరణాల పేరున బంగారం మీద పెట్టుబడి పెడుతుంటారు. బంగారం అనే కాన్సెప్ట్ మినహాయిస్తే.. వెండి, ఇత్తడి, బంగారం, డైమండ్ ఇలా చాలా రకాల ఆభరాలే ఉంటాయి మహిళల దగ్గర. సాధారణంగా అందరూ ధరించే ఇలాంటి ఆభరణాలు కొన్ని సార్లు వాడిన తరువాత కాస్త మెరుపు కోల్పోతాయి. అదంతా కామన్ అని కొందరు అనుకుంటారు. మరికొందరు మెరుగు పెట్టేవాళ్ల దగ్గరకు వెళ్ళి ఆభరణాలు కొత్తగా ఉండేలా చూసుకుంటారు. అయితే ఇంటి దగ్గరే ఆభరణాలు కొత్తవాటిలా కనిపించేలా చేయడం పెద్ద కష్టమేమీ కాదు. కేవలం మూడే మూడు స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఆభరణాలు అప్పుడే కొన్నవాటిలా చెక్కు చెదరకుండా, మెరుపు కోల్పోకుండా ఉంటాయి. ఇంతకూ అవేంటో తెలుసుకుంటే..
జాగ్రత్త..
నగలను జాగ్రత్త చేయడం ఒక కళ. సాధారణంగా నగలను జాగ్రత్త చేయడానికి చాలామంది ప్లాస్టిక్ బాక్సులను, జిప్ లాక్ బ్యాగులను వాడుతుంటారు. కొన్నిసార్లు ఒకేదాంట్లో ఎక్కువ నగలు పెడుతుంటారు. దీనివల్ల నగలు ఒకదానికొకటి రాసుకుని గీతలు పడతాయి. నగలు మెరుపు కూడా కోల్పోతాయి. అందుకని నగలు జాగ్రత్త చేయడం మొదటి స్టెప్.
నగలను ఎప్పుడూ గాలి చొరబడని, తేమ, వెలుతురు సోకని బాక్సులలో జాగ్రత్త చెయ్యాలి.
నగలు ఒకదానికొకటి రాసుకోకుండా, దూరదూరంగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
నగలు ఉపయోగించిన తరువాత వాటిని జాగ్రత్త చేసేముందు మెత్తని పొడి వస్త్రంతో జాగ్రత్తగా తుడవాలి.
2. శుభ్రం..
నగలు మెరుపు కోల్పోయినప్పుడు వాటికి తిరిగి కొత్తవాటిలా రూపం తీసుకురావడానికి సోప్, సర్ఫ్ వంటి వాటిలో నానబెడతారు. ఆ తరువాత బ్రష్ తో రుద్దేస్తుంటారు. దీనివల్ల ఆభరణాలు వాటి కళ కోల్పోతాయి. దీనికి బదులుగా ప్రస్తుతం మార్కెట్లో చాలా లిక్విడ్ క్లీనర్ లు దొరుకుతున్నాయి. తేలికపాటి లిక్విడ్ క్లీనర్లు ఆభరణాలను చాలా సులువుగా శుభ్రం చేయడానికి సహాయపడతాయి. పైపెచ్చు ఇవి ఆభరణాల రంగును చెక్కుచెదరనివ్వవు. అయితే ఈ లిక్విడ్ క్లీనర్లు కూడా మరీ భీభత్సంగా ఉపయోగించకూడదు.
3. పాలిషింగ్ క్లాత్..
చాలామందికి పాలిషింగ్ క్లాత్ గురించి తెలియదు. ఈ పాలిషింగ్ క్లాత్ లు తిరిగి వినియోగించుకోదగినవిగా కూడా ఉంటాయి. ఇవి ఆభరణాల మీద ఉన్న మచ్చలు, వేలిముద్రలు, దుమ్ము, ధూళి, గీతలు, నూనె పదార్థాలు, మేకప్ సారాలు మొదలైనవన్నీ చాలా సులువుగా శుభ్రం చేయగలవు. ఇవి బంగారం, వెండి, ఇత్తడి, ఇతర ఫ్యాన్సీ జ్యువెలరీని కూడా శుభ్రం చేయడంలో ది బెస్ట్ గా నిలుస్తాయి. ముఖ్యంగా రత్నాలు, డైమండ్స్ మొదలైనవాటి మీద మచ్చలు, గీతలు, దుమ్ము శుభ్రం చేయడానికి వీటినే వాడాలి. ఇది కూడా గట్టిగా కాకుండా సున్నితంగా, స్లో మోషన్ లో తుడవాలి.
ఈ మూడు స్టెప్స్ ఫాలో అయితే ఆభరణాలు ఏళ్లకేళ్ళు వాడినా కొత్తవాటిలానే మెరుస్తుంటాయి.
*నిశ్శబ్ద.