Home » Fashion » If you do this you will become a teenage girl
చిన్నవయసులోనే ఆంటీలా కనబడుతున్నారా... ఇలా చేస్తే టీనేజ్ గర్ల్ అయిపోతారు!
వయసును బట్టి పిలుపు అనేవారు. కానీ ఇప్పుడలా కాదు. వయసుతో సంబంధం లేకుండా మనుషుల్ని చూసి ఆటోమెటిక్ గా కొన్ని పిలుపులు వచ్చేస్తాయి చాలామందికి. ముఖ్యంగా మహిళలు ఎదుర్కొనే ఇలాంటి మాటల్లో ఆంటీ కూడా ఒకటి. నిండా ముప్పై ఏళ్ళు కూడా నిండకనే ఆంటీ అనే మాట అంటూంటే అమ్మాయిలు చాలా బాధపడుతుంటారు. అయితే దీనివెనుక సరైన కారణమే ఉండి ఉంటుందనే విషయం మహిళలు అర్థం చేసుకోవాలి. ఇతరులు వయసుకు మించిన వరుసలతో పిలుస్తున్నారంటే దానికి కారణం శారీరకంగా ఉన్న వయసు కంటే పెద్దగా కనిపిస్తున్నారనే అర్థం. అలా కాకుండా వయసు పెరిగినా ఈ ఆంటీ అనే ట్యాగ్ మీద పడకూడదు అంటే శారీరకంగా చాలా ఫిట్ గా ఉండాలి. ఇందుకోసం యాంటీ ఏజింగ్ వ్యాయామాలు చాలా సహాయపడతాయి. కేవలం నాలుగే నాలుగు పనులు దినచర్యలో భాగం చేసుకుంటే చాలు సంతూర్ మమ్మీలు నిజంగానే తయారవుతారు.
యోగా చేయాలి..
యోగా అనేది వ్యాయామం అని చాలామంది అనుకుంటారు. కానీ నిజమేంటంటే యోగా అనేది ఒక జీవనశైలి. రోజులో ఏ పని చేసినా ఒక నియమానుసారంగా చేయడం వల్ల మనసు, శరీరం ప్రశాంతంగా ఉంటాయి. ఇక యోగాలో భాగం అయిన ఆసనాలు, బ్రీతింగ్ ఎక్సర్సైజులు, శరీరాన్ని వంపు తిప్పడం, వివిధ భంగిమలు శరీరాన్ని చాలా ఫిట్ గా ఉంచుతాయి. యోగా చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. ఇది మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్న చందాన యోగా వల్ల అటు శారీరక ధృడత్వం, ఇటు మానసిక ఆరోగ్యం రెండూ చేకూరతాయి. అందుకే ప్రతిరోజూ ఉదయం కొంతసేపు యోగా చేయాలి.
బరువులు ఎత్తడం..
రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ లు ఫాలో కావడం వల్ల శరీరం ధృడంగా మారుతుంది. ఇది కండరాలను బలోపేతం చేస్తుంది. బరువులు ఎత్తడం వల్ల కండరాలు మాత్రమే కాదు జీపక్రియ కూడా మెరుగ్గా మారుతుంది. బరువు నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది. నేటికాలంలో సగం పైగా ఫిట్నెస్ పాడవుతున్నది బరువు నియంత్రణలో లేకపోవడం వల్లనే. కాబట్టి బరువులు ఎత్తడం రోజూ ప్రాక్టీస్ చేస్తే శరీరం మంచి ఆకృతిలోకి మారుతుంది. ఇది యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
నడక..
ఎలాంటి పరికరాలు అక్కర్లేకుండా ఎవరి సహాయం అవసరం లేకుండా ఎలాంటి ఖర్చు లేకుండా చేయగలిగే వ్యాయామం ఏదైనా ఉందంటే అది నడక అనే చెప్పవచ్చు. నడకలో కూడా బ్రిస్క్ వాక్ చేస్తే గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. రోజుకు కనీసం వేల నుండి 10వేల అడుగులు నడుస్తుంటే శరీరం ఫిట్ గా మారుతుంది. నడకను దీర్ఘకాలం ఫాలో అయ్యేవారు యవ్వనంగా కనిపిస్తారు.
ఈత..
ఈత చాలా మంచి వ్యాయామం. ఇది పూర్తీ శరీరానికి ఫిట్నెస్ ను అందిస్తుంది. సాధారణ వ్యక్తులకే కాదు.. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈత ఫాలో అయితే కీళ్ల మీద ఒత్తిడి తగ్గి కీళ్ల నొప్పులు తగ్గుతాయి. పైపెచ్చు ఈత వల్ల గుండె ఆరోగ్యం కూడా బలంగా మారుతుంది. నీటిలో శ్వాస దీర్ఘంగా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి శ్వాస సంబంధ సమస్యలు ఏమైనా ఉంటే తగ్గుతాయి. ఊపిరితిత్తుల సామర్థ్యం కూడా పెరుగుతుంది. శరీరం ఫిట్ గా మారడం వల్ల ఈతను దీర్ఘకాలం ఫాలో అయితే యవ్వనంగా ఉంటారు.
*నిశ్శబ్ద.