Home » Fashion » How to apply liquid lipstick perfectly
లిక్విడ్ లిప్‌స్టిక్ ఇలా అప్లై చేస్తే అదుర్స్!
పెదవుల అందాన్ని పెంచడానికి లిప్స్టిక్ వాడతారు. ఒకప్పుడు లిప్స్టిక్ కోన్ రూపంలో లభించేది. కానీ అన్నీ డవలప్ అయినట్టు ఫ్యాషన్ కూడా డవలప్ అయిపోయింది. లిప్స్టిక్ కాస్తా లిక్విడ్ రూపంలోకి మారింది. పైపెచ్చు లిక్విడ్ లిప్స్టిక్ కూడా వేసుకోవాల్సిన రీతిలో వేసుకుంటే చాలా కాలం పాటు పోకుండా పెదవులను మెరిపిస్తుంది. లిక్విడ్ లిప్స్టిక్ అప్లై చేసేటప్పుడు ఈ కింది టిప్స్ పాటిస్తే చాలు..
మేకప్ అంటే అంతగా ఇష్టం లేని మహిళలు కూడా లిప్స్టిక్, కాటుక పెట్టుకుంటారు. ముఖ్యంగా ఇప్పట్లో వచ్చిన లిక్విడ్ లిప్స్టిక్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
లిప్స్టిక్ వేసుకోవడానికి ముందు పెదవులకు మాయిశ్చరైజర్ రాయడం తప్పనిసరి. మాయిశ్చరైజర్ రాయడం వల్ల పెదవులు తేమను కోల్పోకుండా మృదువుగా ఉంటాయి. పైగా లిప్స్టిక్ పెదవులు అంతా బాగా పరచుకుంటుంది. కానీ లిక్వి్డ్ లిప్స్టిక్ కు మాయిశ్చరైజర్ అవసరం లేదు. పెదవులు మరీ గరుకుగా ఉంటే తప్ప మాయిశ్చరైజర్ రాయాల్సిన అవసరం లేదు. అప్పుడు కూడా చాలా లైట్ గా మాయిశ్చరైజర్ రాస్తే సరిపోతుంది.
పెదవులు పర్ఫెక్ట్ షేప్ కనిపించాలంటే మాత్రం లిప్ లైనర్ ఖచ్చితంగా అప్లై చేయాలి. ఏ రంగు లిప్స్టిక్ వాడతారో ఆ రంగు లిప్ లైనర్ ను ఎంచుకోవాలి. ఇద కూడా చాలా సన్నగా ఉండాలి. అలా ఉంటే పెదవుల షేప్ బాగా సెట్ అవుతుంది. మరీ ముఖ్యంగా పెదవుల మూలలను సరిచేయడం మరవకూడదు.
సాధారణ లిప్స్టిక్ కు, లిక్విడ్ లిప్స్టిక్ కు తేడా ఉంటుంది. లిక్విడ్ లిప్స్టిక్ క్రీమ్ లాగా ఉంటుంది. దీన్ని సాధారణ లిప్స్టిక్ మాదిరి రెండు మూడు లేయర్లు వెయ్యాల్సిన అవసరం లేదు. అలా వేస్తే పెదవులు చాలా థిక్ గా వికారంగా కనపిస్తాయి. అందుక లిక్విడ్ లిప్స్టిక్ ను కేవలం ఒక లేయర్ మాత్రమే అప్లై చేయాలి. అది వేసాక కూడా కొద్దిసేపు దాన్ని అలాగే వదిలెయ్యాలి అలా చేస్తే లిప్స్టిక్ ఆరిపోతుంది.
ఒకవేళ లిక్విడ్ లిప్స్టిక్ ఎక్కువగా అప్లై చేసి ఉంటే టిష్యూ పేపర్ సహాయంతో దాన్ని సెట్ చేసుకోవాలి. ఇందుకోసం టిష్యూ పేపర్ ను పెదవుల మధ్య పెట్టుకుని పెదవులను గట్టిగా ప్రెస్ చేయ్యాలి. ఇలా చేస్తే పెదవుల మీద అదనపు లిక్విడ్ ఈజీ గా తొలగిపోతుంది.
లిక్విడ్ లిప్స్టిక్ అప్లై చేయడం గురించి తెలుసుకుని ఉంటారు కానీ కరెక్ట్ రంగు ఎంపిక చేసుకునేవారు చాలా అరుదు. అందుకే లిక్విడ్ లిప్స్టిక్ సరైన రంగు ఎంచుకోవడం ముఖ్యం. ఇలా పెదవుల అందం అదుర్స్.
*నిశ్శబ్ద