Home » Beauty Care » హెర్బల్ స్కిన్ కేర్ రొటీన్ ఎప్పుడైనా ఫాలో అయ్యారా?
హెర్బల్ స్కిన్ కేర్ రొటీన్ ఎప్పుడైనా ఫాలో అయ్యారా?
హెర్బల్.. దీన్ని తెలుగులో మూలిక అని అంటారు. మూలికలు ఆయుర్వేదంలో భాగంగా చెబుతారు. ఇందులో ఎలాంటి రసాయనాలు ఉండవు. పూర్తీగా సహజమైన పదార్థాలు , చర్మానికి నష్టం కలిగించని పదార్థాలు ఉంటాయి. అందుకే హెర్బల్ ఉత్పత్తులకు కూడా ఆదరణ పెరిగింది. ఇప్పటి కాలంలో అమ్మాయిలు స్కిన్ కేర్ రొటీన్ బాగా ఫాలో అవుతుంటారు. అయితే హెర్బల్ స్కిన్ కేర్ ఫాలో అయితే చర్మం చాలా ఆరోగ్యంగా ఉంటుందట. ఇంతకీ ఇందులో ఏమేమి వాడాలో తెలుసుకుంటే..
రోజ్ వాటర్ చర్మానికి చాలా మంచిది. కానీ దీన్ని ఎక్కువగా వాడరు. రోజ్ వాటర్ లేదా పసుపుతో చేసి ఫేస్ వాష్ వంటి తేలికపాటి హెర్బల్ ఫేస్ వాష్ తో చర్మాన్ని శుభ్రపరచాలి. ఇది ఉదయాన్నే చేయాలి. రోజు ఉదయం దీనితో చర్మాన్ని శుభ్రం చేస్తే చర్మం తాజాగా ఉంటుంది. రాత్రి వరకు చర్మానికి కలిగిన అలసట పోతుంది. చర్మం మీద మురికి, జిడ్డు వంటివి పోతాయి. చర్మం తాజాగా ఉంటుంది.
చర్మానికి టోనర్ వాడటం చాలా మంచిది. చర్మ రంధ్రాలను కవర్ చేసి చర్మాన్ని తాజాగా ఉంచే రోజ్ వాటర్ లేదా కీర దోసకాయ వంటి పదార్థాలతో తయారు చేసిన హెర్బల్ టోనర్లను వాడాలి.
ఫేస్ సీరమ్ కూడా చర్మానికి మేలు చేస్తుంది. అలోవెరా, విటమిన్-సి, వేప వంటి హెర్బల్ సీరమ్ లు ఎంచుకోవాలి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేసి చర్మాన్ని కాంతివంతం చేస్తాయి.
చర్మం మీద మచ్చలు,మొటిమల తాలూకు గుర్తులు ఉంటే పసుపు, వేప, తులసి రసం వంటివి అప్లై చేయాలి. ఇవన్నీ మచ్చలు, మొటిమలు తగ్గించడంలో సహాయపడతాయి.
చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచడంలో మాయిశ్చరైజర్ చాలా బాగా సహాయపడుతుంది. ఇందుకోసం తేనె, అలోవెరా, ఆర్గాన్ ఆయిల్ వంటి హెర్బల్ మాయిశ్తరైజర్లను ఎంచుకోవాలి.
బయటకు వెళ్లే ముందు సన్ స్క్రీన్ ను వాడటం తప్పనిసరి. అయితే సూర్య కిరణాల నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి గ్రీన్ టీ లేదా జియోలిన్ వంటి హెర్బల్ సన్ స్క్రీన్ లను ఉపయోగించుకోవాలి.
పై హెర్బల్ స్కిన్ కేర్ ఫాలో అయితే చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది. ఇది చర్మానికి లోతుగా పోషణ ఇస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉంచుతుంది.
*రూపశ్రీ.