Home » Beauty Care » రోజూ ముఖానికి తేనె అప్లై చేస్తే ఎన్ని ప్రయోజనాలో మీకు తెలుసా!
రోజూ ముఖానికి తేనె అప్లై చేస్తే ఎన్ని ప్రయోజనాలో మీకు తెలుసా!
తేనె ఆరోగ్యానికి అద్బుతమైన ఔషధం. తేనె శరీరానికి చేకూర్చే లాభాల గురించి చెప్పాలంటే పెద్ద లిస్టే తయారవుతుంది. రుచికి తియ్యగా, ఆహ్లాదంగా అనిపించే తేనె శరీరంలో ఏర్పడే అసౌకర్యాన్ని, .. జబ్బులను తగ్గిస్తుంది. అయితే తేనెను ఇలా ఆహారంలోనే కాదు.. చర్మానికి కూడా ఉపయోగించవచ్చు. తేనెను చర్మానికి ఉపయోగించడం వల్ల చాలా షాకింగ్ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రతిరోజూ కొన్ని చుక్కల తేనెను ముఖానికి రాసుకుంటూ ఉంటే ఆశ్చర్యకరమైన ఫలితాలు ఉంటాయి.
తేనె ఎలా పనిచేస్తుంది..
తేనెలో యాంటీ ఆక్సిడెంల్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీరాడికల్స్ నుండి కాపాడతాయి. తద్వారా చర్మం డ్యామేజ్ కావడం తగ్గుతుంది. అంతేకాదు తేనెలో ఉండే సమ్మేళనాలు చర్మానికి బిగుతును ఇస్తాయి. ప్రతిరోజూ కొన్ని చుక్కల తేనెను ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. చర్మం మీద ముడతలు, గీతలు తగ్గుతాయి. ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది. ఇది చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా చర్మానికి ఎలాస్టిక్ గుణాన్ని పెంచుతుంది.
పొడి చర్మం ఉన్నవాళ్లకు తేనె భలే పనిచేస్తుంది. చర్మం పొడిబారడం తగ్గి చర్మం మృదువుగా మారుతుంది. చర్మంలో ఉండే డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. తేనె చర్మాన్ని క్లియర్ చేస్తుంది. తద్వారా కొత్త చర్మ కణాల ఉత్పత్తి ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మెరిచేలా చేస్తుంది.
మొటిమలు, చర్మ సంబంధ సమస్యలు, ర్యాషెస్ వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారికి తేనె చక్కని మార్గం. తేనెను రోజూ కొన్ని చుక్కలు ముఖానికి రాస్తుంటే ముఖం మీద మొటిమలు ఏర్పడటం తగ్గుతుంది. తరచుగా మొటిమల సమస్యతో ఇబ్బంది పడేవారికి ఈ చిట్కా ఎంతగానో సహాయపడుతుంది. మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియా సులువుగా తొలగిపోతుంది.
*రూపశ్రీ.