Home » Beauty Care » సున్నితమైన చర్మమా బ్యూటీ హ్యాక్స్ ట్రై చేసే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

సున్నితమైన చర్మమా బ్యూటీ హ్యాక్స్ ట్రై చేసే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

అందంగా, కాంతివంతంగా కనిపించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇందుకోసం సోషల్ మీడియాలో కనిపించే ఎన్నో రకాల చిట్కాలు, ఫేస్ ప్యాక్‌లు, వైరల్ బ్యూటీ హ్యాక్స్‌ను ఎంతోమంది ప్రయత్నిస్తుంటారు. కానీ సున్నితమైన చర్మం లేదా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు ఇలాంటి చిట్కాలను గుడ్డిగా పాటించడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది.  మెరిసిపోయే చర్మం కోసం చేసే కొన్ని తొందరపాటు పనుల వల్ల చర్మం ఎర్రబడటం, దురద, మంట , చర్మం చాలా  పొడిబారడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు బ్యూటీ ప్రొడక్ట్స్ లేదా చిట్కాలను ఉపయోగించేటప్పుడు ఏ తప్పులు చేయకూడదు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా తెలుసుకుంటే..

నిమ్మరసాన్ని నేరుగా ముఖానికి రాయడం..

సాధారణంగా నిమ్మరసం చర్మాన్ని శుభ్రం చేస్తుందని చాలామంది భావిస్తారు. ఇది సహజ బ్లీచ్ అని కూడా అంటారు.  కానీ నిమ్మరసంలో యాసిడ్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని నేరుగా సెన్సిటివ్ స్కిన్ మీద రాసుకోవడం వల్ల తీవ్రమైన మంట వస్తుంది. అలాగే నిమ్మరసం రాసుకుని ఎండలోకి వెళ్తే చర్మంపై నల్లటి మచ్చలు ఏర్పడటంతో పాటు చర్మం పాడయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి మైల్డ్ లేదా తక్కువ ప్రభావం లేని క్లెన్సర్‌ను మాత్రమే ఉపయోగించాలి.

బేకింగ్ సోడాతో స్క్రబ్ చేయడం..

ఇంట్లోనే తయారుచేసుకునే ఫేస్ స్క్రబ్‌లలో చాలామంది బేకింగ్ సోడాను వాడుతుంటారు. అయితే బేకింగ్ సోడా చర్మం యొక్క సహజ పీహెచ్ సమతుల్యతను దెబ్బతీస్తుంది. దీనివల్ల చర్మం త్వరగా పొడిబారిపోయి, పొరలు ఊడటం లేదా రక్షణ పొర దెబ్బతినడం జరుగుతుంది. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు బేకింగ్ సోడాను స్క్రబ్‌గా వాడకపోవడమే మంచిది.

పదే పదే ఎక్స్‌ఫోలియేషన్ లేదా స్క్రబ్బింగ్ చేయడం..

 చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించడానికి స్క్రబ్బింగ్ అవసరమే అయినప్పటికీ, దానిని అతిగా చేయకూడదు. గట్టిగా ఉండే స్క్రబ్‌లు లేదా కెమికల్ ప్రొడక్ట్స్‌తో పదే పదే ముఖాన్ని తోమడం వల్ల సెన్సిటివ్ స్కిన్ ఎర్రబడి, చికాకు పెరుగుతుంది.  చర్మం తత్వానికి తగినట్లుగా మాత్రమే ఎక్స్‌ఫోలియేషన్ చేయాలి.

వైరల్ అయ్యే ప్రతి ఫేస్ ప్యాక్‌ను వాడటం..

సోషల్ మీడియాలో ఏదైనా ఫేస్ ప్యాక్ ట్రెండ్ అవుతోందంటే అది అందరికీ సెట్ అవుతుందని అనుకోవడం పొరపాటు. ఫేస్ ప్యాక్‌లలో వాడే సువాసనలు, ఎస్సెన్షియల్ ఆయిల్స్ , కొన్ని రకాల సహజపదార్థాలు కూడా సెన్సిటివ్ చర్మంపై అలెర్జీని లేదా మంటను కలిగిస్తాయి. కాబట్టి ఏ ప్యాక్ అయినా వాడే ముందు జాగ్రత్త పడటం అవసరం.

ప్యాచ్ టెస్ట్ చేయకుండా ప్రొడక్ట్స్ వాడటం.. 

ఏదైనా కొత్త క్రీమ్, సీరం లేదా ఇంట్లో తయారుచేసిన ప్యాక్ అయినా సరే, నేరుగా ముఖంపై అప్లై చేయకూడదు. ముందుగా చేతిపై లేదా చెవి వెనుక భాగంలో కొద్దిగా రాసి ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఎలాంటి మంట లేదా అలెర్జీ రాలేదని నిర్ధారించుకున్నాకే ముఖానికి వాడాలి.

స్ట్రాంగ్ కెమికల్స్ , పర్ఫ్యూమ్ ప్రొడక్ట్స్ వాడటం.. 

అధిక సువాసన ఉన్న ప్రొడక్ట్స్ లేదా ఆర్టిఫిషియల్ కెమికల్స్ ఉన్న స్కిన్‌కేర్ వస్తువులు సెన్సిటివ్ స్కిన్‌ను త్వరగా దెబ్బతీస్తాయి. కాబట్టి కెమికల్స్ తక్కువగా ఉండి, ఫ్రాగ్రన్స్ ఫ్రీగా ఉండే సౌమ్యమైన ప్రొడక్ట్స్‌ను మాత్రమే ఎంచుకోవాలి.

చర్మానికి తగిన తేమ, రక్షణ ఇవ్వకపోవడం..

సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు చర్మాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. చర్మానికి సరిపడే మంచి మోయిశ్చరైజర్‌ను క్రమం తప్పకుండా వాడాలి. అలాగే ఎండ నుంచి చర్మాన్ని కాపాడుకోవడానికి మైల్డ్ సన్‌స్క్రీన్‌ను తప్పనిసరిగా ఉపయోగించాలి.

సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు ఏవో వైరల్ చిట్కాలు, ఖరీదైన హ్యాక్స్ వెనుక పడకుండా తమ చర్మం అవసరాలను అర్థం చేసుకుని, సరైన భద్రతా నియమాలు పాటిస్తే చర్మం ఆరోగ్యంగా, ప్రశాంతంగా , కాంతివంతంగా ఉంటుంది.

                          *రూపశ్రీ.


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.