Home » Beauty Care » వేలాది రూపాయల ఖరీదైన క్రీమ్ కూడా దీని ముందు దిగదుడుపే..!
వేలాది రూపాయల ఖరీదైన క్రీమ్ కూడా దీని ముందు దిగదుడుపే..!
చర్మ సంరక్షణ ఎప్పటికీ పాతబడని అంశం. కాలం మారే కొద్ది చాలామంది చర్మం సంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు ఇంటి టిప్స్ నుండి మార్కెట్లో దొరికే వాణిజ్య ఉత్పత్తుల వరకు చాలా రకాలు ఉపయోగిస్తారు. వీటిలో రెటినోల్ కూడా ఒకటి. రెటినోల్ అంటే విటమిన్-ఎ1. ఇది చర్మంలో కొల్లాజెన్ నష్టాన్ని నిరోధిస్తుంది. ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. అయినప్పటికీ ఇది చాలా ఖరీదైనది. వేలాది రూపాయలు ఖర్చు చేసి ఇలాంటి క్రీములు కొనే బదులు ఇంట్లోనే దానికి సమానమైన ఫలితాలు ఇచ్చే క్రీమ్ ను తయారు చేసుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థాలు.. తయారీ విధానం గురించి తెలుసుకుంటే..
విటమిన్ ఎ చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. విటమిన్ ఎ మరింత ప్రభావవంతమైన రూపం రెటినోల్. వృద్దాప్యం కనిపించకుండా చర్మం యవ్వనంగా ఉంచడంలో ఇది అద్భుతంగా సహాయపడుతుంది.
ఇంట్లోనే రెటినోల్ వంటి క్రీమ్..
ఇంట్లోనే సాలిసిలిక్ యాసిడ్ ఎలా తయారు చేయాలో కింద చెప్పబడింది. వంటగదిలో లభించే వస్తువుల నుండి రెటినోల్‌ను ఎలా తయారు చేసుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం తెలుసుకుంటే..
కావలసిన పదార్థాలు..
బియ్యం పిండి - 2 స్పూన్లు
తాజా కలబంద జెల్ - 1 టీస్పూన్
రైస్ సీరం - 3-4 చుక్కలు(రైస్ సీరమ్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు లేదా మార్కెట్లో కొనుగోలు చేయవచ్చు)
నీరు - 1 గ్లాసు
తయారీ విధానం..
ముందుగా పాన్ తీసుకుని అందులో నీటిని పోసి వేడి చేయాలి.
ఇప్పుడు అందులో బియ్యప్పిండి వేసి చిక్కని పేస్ట్ తయారయ్యే వరకు ఉడికించాలి.
దీని తర్వాత ఆ పేస్ట్‌లో రైస్ సీరమ్, కలబంద జెల్ వేసి బాగా కలపాలి. ఇలా చేస్తే తెల్లటి పేస్ట్ సిద్ధం అవుతుంది.
హోమ్ మేడ్ రెటినోల్ క్రీమ్ తయారైనట్టే.. దీన్ని ఉపయోగించడం వల్ల చర్మం ఎక్కువ కాలం యవ్వనంగా ఉంటుంది.
ప్రయోజనాలు ఎలా ఉంటాయంటే..
బియ్యంతో తయారు చేసిన ఈ రెటినోల్ క్రీమ్‌ను ఉపయోగించడం వల్ల చర్మం కాంతివంతం అవ్వడమే కాకుండా గ్లాస్ స్కిన్ లభిస్తుంది. చర్మం అద్భుతంగా మారుతుంది. చర్మం మీద ఉండే పెద్ద రంద్రాలను తగ్గించి చర్మపు రంగును సమం చేస్తుంది.
*రూపశ్రీ.