Home » Beauty Care » బంగాళదుంప గురించి మీకు తెలియని నిజం.. ఇలా ముఖానికి రాస్తే..!
బంగాళదుంప గురించి మీకు తెలియని నిజం.. ఇలా ముఖానికి రాస్తే..!
బంగాళదుంప ఎంతో రుచిగా ఉంటుంది. ఇది ఏ కర్రీలోకి అయినా ఇట్టే ఇమిడిపోతుంది. బంగాళదుంపల చిప్స్, ఫ్రెంచ్ ప్రైస్ మొదలైనవి కూడా చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు పెద్దలు కూడా వీటిని తినడానికి ఇష్టపడతారు. అయితే బంగాళదుంపలను ముఖానికి కూడా ఉపయోగిస్తారు. వీటిని ఉపయోగించి అందాన్ని పెంచుకోవచ్చు. ముఖ్యంగా బంగాళదుంపను కింద చెప్పుకున్నట్టు ముఖానికి రాస్తే ముఖం మెరిసిపోతుందట.
బంగాళదుంపల స్టార్చ్..
బంగాళదుంపల నుండి పిండిని తయారు చేసి దాన్ని ముఖానికి పట్టిస్తే ముఖం మెరిసిపోతుందట. వందలు, వేలు ఖర్చు పెట్టిన క్రీములు ఇవ్వని ఫలితాన్ని బంగాళదుంపల స్టార్చ్ వల్ల లభిస్తుందట.
బంగాళదుంప ముఖానికి ఎందుకంత ఎఫెక్ట్..
బంగాళాదుంపలో సహజమైన బ్లీచింగ్ లక్షణాలు ఉన్నాయి. ఇది చర్మంపై మచ్చలను తేలికపరచడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్లు చర్మం ఛాయను మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. బంగాళాదుంప పిండి బంగాళాదుంప రసం కంటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మృదువుగా చేయడానికి, నల్లటి వలయాలను తగ్గించడానికి, టానింగ్, పిగ్మెంటేషన్, ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది.
కావసిన పదార్థాలు..
బంగాళదుంప రసం - 1 గిన్నె
నిమ్మరసం - 1/2 టీస్పూన్
పాలపొడి - 1 టీస్పూన్
తయారు విధానం..
ముందుగా కొన్ని బంగాళదుంపలను తీసుకుని తురుముకోవాలి. రసం తీసి ఆ రసాన్ని గిన్నెలో ఉంచుకోవాలి.
ఒక గాజు గిన్నెలో 1-2 గంటలు పక్కన పెట్టాలి. తర్వాత గిన్నె అడుగున తెల్లగా పేరుకుపోయినట్లు మీరు కనిపిస్తుంది.
ఇప్పుడు బంగాళాదుంప రసాన్ని గిన్నె వంకరగా వంచుతూ రసాన్ని వేరే గిన్నెలో పోయాలి. గిన్నె దిగువన తెల్లటి పదార్థం కనిపిస్తుంది. దానిలో ఒక చెంచా బంగాళాదుంప రసాన్ని అలాగే ఉంచాలి.
అడుగున ఉన్న ఈ తెల్లని పిండే బంగాళదుంప స్టార్చ్.
ఇప్పుడు ఈ గిన్నెలో కొన్ని చుక్కల నిమ్మకాయ రసం, ఒక చెంచా పాలపొడి వేసి బాగా కలపాలి.
ముఖాన్ని కాంతివంతం చేసి డార్క్ స్పాట్లను లైట్ చేసే ఫేస్ ప్యాక్ రెడీ అయినట్టే.
దీన్ని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత ముఖం కడుక్కోవాలి. మొదట సారి వాడన తరువాతే చాలా మార్పు కనిపిస్తుంది.
*రూపశ్రీ.