![]() |
![]() |

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలతో అటు రాజకీయాలతో బిజీ బిజీగా ఉన్నారు. రాజకీయాలు నడపాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే సినిమాల్లో నటించాలి. ఇలా ఉంది పవన్ పరిస్థితి. ముందుగానే పార్టీకి డొనేషన్లు వచ్చే అవకాశం లేదు. దాంతో తను సొంతగా సంపాదించిన డబ్బునే రాజకీయాలలో పెడుతున్నారు. సభల కోసం యాత్ర కోసం కౌలు రైతులకు ఇస్తున్న ఆర్దిక సహాయం వంటి వాటికి తన రెమ్యూనరేషన్ ని ఖర్చు చేస్తున్నారు.
ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తనతో గతంలో ఖుషి, బంగారం చిత్రాలను నిర్మించిన ఏఎం రత్నం నిర్మాతగా హరిహర వీరమల్లు అనే భారీ పీరియాడికల్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం కావడం, పవన్ నటిస్తున్నమొదటి పీరియాడికల్ మూవీ కావడం, పవన్ చిత్రాల్లోనే హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందుతూ ఉండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.
కాగా ఈ సినిమా షూటింగ్ 60 శాతం పూర్తయిందని కొందరు, షూటింగ్ చివరి దశలో ఉందని మరికొందరు అంటున్నారు. మొత్తానికి ఈ చిత్రం తర్వాత పవన్ ఏ చిత్రంలో నటిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. పవన్ ప్రస్తుతానికి రెండు రీమేకులకు పచ్చ జెండా ఊపారు. అందులో ఒకటి కోలీవుడ్‌లో విజయ్ నటించిన తేరీ రీమేక్ కాగామరొకటి సముద్ర ఖని దర్శకత్వంలో ఆయనే ముఖ్యపాత్రను పోషిస్తూ చేసిన వినోదాయ సిత్తమ్ ఒకటి. ఈ వినోదాయ సిత్తం చిత్రంలో పవన్ మేనల్లుడు సాయి ధరంతేజ్ మెయిన్ లీడ్ రోల్ పోషిస్తున్నాడట. తమిళంలో సముద్ర ఖని పోషించిన కీలకపాత్రను పవన్ పోషించనున్నట్లు సమాచారం. సినిమా మొత్తం సాయి ధరమ్ తేజ కనిపించినప్పటికీ కథను నడిపించేది మాత్రం పవన్ పాత్రే అని తెలుస్తోంది. కాగా తెలుగులో పవన్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా గోపాలా గోపాలా తరహాలో పవన్ పాత్రకి మరింత నిడివిని ఇస్తున్నారని తెలుస్తోంది. ఇక తేరీ, వినోదాయ సిత్తములలో ఏది ముందుగా సెట్స్ పైకి వెళుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ముందుగా పవన్ వినోదాయ సిత్తం రీమేక్ లో నటించనున్నాడట. దీనికోసం ఆయన 45 రోజుల కాల్ షీట్స్ కేటాయించారని సమాచారం. ఈ చిత్రం పూర్తయిన తర్వాతనే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కనుంది. పవన్ హరీష్ శంకర్ల కాంబినేషన్‌లో గబ్బర్ సింగ్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో అంతటా ఆసక్తి నెలకొని ఉంది. గబ్బర్ సింగ్ కూడా బాలీవుడ్ మూవీ దబాంగ్ రీమేకే అన్న సంగతి తెలిసిందే. అయితే అందులోని మెయిన్ పాయింట్ ని తీసుకొని పవన్ ఇమేజ్ కి తగ్గట్టుగా కమర్షియల్ ఎలిమెంట్లను తీర్చిదిద్ది దీనిని బ్లాక్ బస్టర్ గా హరీష్ శంకర్ తెరకెక్కించారు.
ఇక తేరీ రీమేక్ విషయంలో కూడా హరీష్ శంకర్ అదే చేయనున్నాడని సమాచారం. సినిమాలోని సోల్ పాయింట్ ను పట్టుకొని దానికి చుట్టూ పవన్ పాత్రను డిజైన్ చేస్తూ ప్రేక్షకులకు నచ్చేలా, అభిమానులు మెచ్చేలా ఈ సినిమాను తెరకెక్కించాలని హరీష్ శతవిధాలుగా స్క్రిప్ట్ విషయంలో చాలా కష్టపడుతున్నాడని తెలుస్తోంది. మొత్తానికి పవన్ కెరీర్ లో ఈ రెండు రీమేకులు ఎలాంటి ఫలితాలను అందిస్తాయో వేచి చూడాలి. కాగా తేరీ రీమేక్ ను మెగా ఫ్యామిలీకి కలిసి వచ్చిన మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తుండడం విశేషం.
![]() |
![]() |