Home  »  News  »  udhayanidhi stalin: ఉదయనిధి స్టాలిన్ హీరో.. మరి విజయ్ పరిస్థితి ఏంటి 

Updated : May 25, 2026

   
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత డిఎంకె ఎంఎల్ఎ ఉదయనిధి స్టాలిన్(udhayanidhi stalin)రాజకీయం కుటుంబానికి చెందిన వ్యక్తే అయినా, సినీ రంగంలోకి ప్రవేశించి ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నాడు. ఇప్పటి వరకు ఆయన నుంచి సుమారు పన్నెండు చిత్రాలు రాగా అవన్నీ దాదాపుగా తెలుగులోను విడుదలయ్యాయి. కాబట్టి ఇక్కడి ప్రేక్షకులకి కూడా సుపరిచయస్తుడే. 2023లో వచ్చిన 'మామన్నన్' (తెలుగులో నాయకుడు) మూవీ  తన కెరీర్‌లో ఆఖరి చిత్రమని ఆడియో వేడుక సాక్షిగా ఉదయనిధి  స్వయంగా వెల్లడి చేసాడు.

కానీ గత కొద్ది రోజులుగా కోలీవుడ్‌లో ఆయన రీఎంట్రీపై బలమైన ప్రచారం సాగుతోంది. ఒక ప్రముఖ స్టార్ డైరెక్టర్ చెప్పిన స్క్రిప్ట్ ఉదయనిధికి  నచ్చిందని, దీంతో ఆయన మళ్ళీ మేకప్ వేసుకోవడానికి సుముఖత వ్యక్తం చేశారని తెలుస్తోంది. రాజకీయంగా తమిళనాడు అసెంబ్లీలో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీతో తీవ్రమైన రాజకీయ సమరం నడుస్తున్న ఈ తరుణంలో, ఉదయనిధి మళ్లీ సినిమాల్లోకి రావడం వెనుక బలమైన వ్యూహం ఉందనే చర్చ మొదలైంది. సాధారణంగా ఉదయనిధి స్టాలిన్ సినిమాలు సామాజిక స్పృహతో పాటు పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో  ఉంటాయి. గతంలో ఆయన నటించిన 15 చిత్రాలలో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు రాబోయే కొత్త చిత్రం కూడా ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టేలా, ప్రజల్లోకి డీఎంకే సిద్ధాంతాలను బలంగా తీసుకెళ్లేలా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

Also read: jetlee: జెట్ లీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. రికార్డు స్థాయిలో నాలుగు లాంగ్వేజెస్ 

అయితే, ఈ రీఎంట్రీ నిర్ణయం వెనుక ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ పెట్టిన ఒక ఆసక్తికరమైన షరతు ఉందని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ కూడా నడుస్తుంది. రాజకీయాల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న తరుణంలో సినిమాల వల్ల పార్టీ బాధ్యతలకు ఎలాంటి ఆటంకం కలగకూడదని సీఎం స్టాలిన్ స్పష్టం చేసినట్లు టాక్. సినిమా షూటింగ్స్ అన్నీ కేవలం వీకెండ్స్ లో లేదా ప్రభుత్వ సెలవు దినాల్లో మాత్రమే జరుపుకోవాలని, రోజుకు 8 గంటల కంటే ఎక్కువ సమయం కేటాయించకూడదని కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ షరతుకు ఉదయనిధి కూడా ఓకే చెప్పడంతో సినిమా పట్టాలెక్కేందుకు మార్గం సుగమమైంది. కేవలం 45 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసేలా ఒక పొలిటికల్ యాక్షన్ డ్రామాను ప్లాన్ చేస్తున్నారట. ఈ భారీ ప్రాజెక్టుని  దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో  రెడ్ జయంట్ మూవీస్ పై ఉదయనిధినే  నిర్మించనున్నట్లు సమాచారం.  మరి తన ప్రత్యర్థి  విజయ్(VIjay)జన నాయగాన్ తన ఆఖరి చిత్రమని ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు  ఉదయనిధి  రీ ఎంట్రీ వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.ఆల్రెడీ కమల్, రజినీ తో రెడ్ జయంట్ మూవీస్ పై ఉదయనిధి భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 
 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.