![]() |
![]() |
.webp)
-కొత్త క్లైమాక్స్ లో ఏముంది
-ఎంతో మందికి స్టార్ స్టేటస్
-1500 థియేటర్స్ లో హంగామా
భారతీయ సినిమా స్థితిని గతిని మార్చివేసిన చిత్రం 'షోలే'(Sholay).ఎంతో మందికి ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ ని కట్టబెట్టి భారతీయ సినీ యవనిక పై తిరుగులేని హీరోలుగా చెలామణి అయ్యే అవకాశం కల్పించింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan)హిమాన్ గా ఫ్యాన్స్ పిలుచుకునే ధర్మేంద్ర,(Dharmendra)హేమమాలిని(Hema Malini) జయబచ్చన్(Jaya Bachchan),అంజాద్ ఖాన్, సంజీవ్ కుమార్ లే ఉదాహరణ. నేటికీ చాలా సినిమాల కథ, కథనాలు, క్యారెక్టర్ల తీరు తెన్నులు 'షోలే' ని ఇన్ స్ప్రెషన్ గా తీసుకొని తెరకెక్కుతాయంటే 'షోలే' సృష్టించిన సునామి రేంజ్ ని అర్ధం చేసుకోవచ్చు.
ఇప్పడు ఈ మూవీ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రీ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది. దీంతో అభిమానులు రీ రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 12 న 1500 థియేటర్లలో విడుదల కాబోతుందని అధికార ప్రకటన వచ్చింది. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే1975లో ‘షోలే’ రిలీజ్ అయినప్పుడు మేకర్స్ మొదట అనుకున్న క్లైమాక్స్ ని మార్చాల్సి వచ్చింది. అప్పట్లో వచ్చిన 'ఎమర్జెన్సీ' కారణంగా, సెన్సార్ బోర్డు అభ్యంతరాలతో ఆ విధంగా చేసారు. అయితే ఇప్పుడు రీ రిలీజ్ లో మొదట అనుకున్న క్లైమాక్స్ సన్నివేశం ఉండబోతుంది. అంటే కొత్త సినిమా చూసిన అనుభూతితో అభిమానులు, ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకి రానున్నారు.
also read: షోలే రీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. కొత్త క్లైమాక్స్ డిటైల్స్ ఇవే
ఆగస్టు 15, 1975న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'షోలే' పక్కా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఇటీవల మరణించిన ధర్మేంద్ర కి రీ రిలీజ్ ద్వారా నివాళి అర్పించనున్నారు. రమేష్ సిప్పి(Ramesh Sippi)దర్శకత్వంలో జి పి సిప్పి నిర్మించగా సలీం జావేద్ రచయితలుగా వ్యవహరించారు. మూడు కోట్ల రూపాయలతో నిర్మాణం జరుపుకొని 35 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
![]() |
![]() |