![]() |
![]() |

నవంబర్ 26 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన సాహసి, యంగ్ ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ 'మేజర్'లో అడివి శేష్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. క్షణం, గూఢచారి, ఎవరు వంటి సూపర్‌హిట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శేష్ గురువారం బర్త్‌డే జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా మేజర్ ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
సందీప్ ఉన్నికృష్ణన్ వీరమరణం పొందిన విధానాన్నే కాకుండా అతను ఎలా జీవించాడనే విషయాలను కూడా ఈ సినిమాలో మనం చూడబోతున్నాం. 27/11న సందీప్ ఉన్నికృష్ణన్ వర్ధంతి సందర్భంగా అడివి శేష్ లుక్ టెస్ట్ పోస్టర్‌తో పాటు, అమరవీరుల జ్ఞాపకాలకు నివాళులు అర్పిస్తూ సినిమా తీసే ప్రయాణాన్ని గురించి వెల్లడించిన వీడియోను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ అనంతరం ఆగస్ట్‌లో మేజర్ షూటింగ్ పునఃప్రారంభమైంది. ఇప్పటివరకూ 70 శాతం చిత్రీకరణ పూర్తయింది.
పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ భాషలలో రూపొందుతోన్న ఈ మూవీకి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తుండగా, తెలుగమ్మాయి శోభితా దూళిపాళ, బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
మహేష్ బాబుకు చెందిన జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మిస్తోన్న 'మేజర్' చిత్రాన్ని 2021 సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ చేయనున్నారు.
![]() |
![]() |