![]() |
![]() |
.webp)
యువ దర్శకుడు సుజీత్ తో ఒక భారీ యాక్షన్ డ్రామా ఫిల్మ్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతులు కలుపుతున్నట్లు కొన్ని రోజుల క్రితం అధికారికంగా ప్రకటన వచ్చింది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక యొక్క పూజా కార్యక్రమం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో సోమవారం జరిగింది.
నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, ఏఎం రత్నం, దిల్ రాజు, బీవీఎస్ఎన్ ప్రసాద్, దర్శకులు హరీష్ శంకర్, శ్రీవాస్, వివేక్ ఆత్రేయ, కోనవెంకట్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి తదితరులు విచ్చేసి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం 10:19 గంటలకు ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు షాట్ కి అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అల్లు అరవింద్, దిల్ రాజు చేతుల మీదుగా చిత్ర దర్శక, నిర్మాతలకు స్క్రిప్ట్ అందజేశారు.
భారీస్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ కెమెరా బాధ్యతలు చూడనుండగా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరించనున్నారు. ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీత అందించనున్నారు. ఈ సినిమా అటు యాక్షన్ ప్రియులకు, ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులకు మెప్పిస్తుందని డీవీవీ దానయ్య తెలిపారు. చిత్రానికి సంభందించి ఇతర తారాగణం, సాంకేతిక వర్గం వివరాలు త్వరలో తెలియజేయబడతాయి.
![]() |
![]() |