Home  »  News  »  బాలకృష్ణ గాయాలపై ఎన్టీఆర్ ట్వీట్ ఇదే.. ఏం చెప్పాడంటే!

Updated : Jul 21, 2026


గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, ,మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మధ్య ఉన్న అనుబంధం సమయం వచ్చినప్పుడు బయటపడుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఆ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం తాలూకు యొక్క సువాసన అభిమానులకి, నెటిజెన్స్ ని తెలిసింది  దర్శకుడు గోపి చంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న nbk111 షూటింగ్  కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ కాకినాడ పోర్ట్ లో జరుగుతుంది.  అందులో భాగంగా బాలకృష్ణ, మంచు మనోజ్ పై  యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో అనుకోకుండా బాలకృష్ణ కాలు జారీ పడటంతో మోకాలికి స్వల్ప గాయం అయ్యింది


 ఈ విషయం తెలియడంతో ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా 'Get well soon Bala Babai. Wishing you a speedy recovery and good health. Looking forward to seeing you roar back in full form..." అని ఎన్టీఆర్ ఎంతో ఆత్మీయంగా రాసుకొచ్చారు. అంటే "బాబాయ్, మీరు త్వరగా కోలుకోవాలి. మీకు గాయాల నుంచి విముక్తి కలిగి మంచి ఆరోగ్యం కలగాలని ఆకాంక్షిస్తున్నాను. మీరు మళ్లీ పూర్తి ఫామ్‌లో గర్జించడాన్ని చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను..." అని ఎన్టీఆర్ తన సందేశంలో అత్యంత భావోద్వేగంగా పేర్కొన్నారు.


Also read: అభిమానుల పూజలు.. బాలకృష్ణ హెల్త్ అప్ డేట్ ఇదే  

ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్‌లో "రోర్ బ్యాక్" అని ఉపయోగించిన పదం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సింహంలా బాబాయి మళ్లీ బాక్సాఫీస్ వద్ద గర్జించాలని ఎన్టీఆర్ కోరుకోవడం వారి మధ్య ఉన్న ఆత్మీయతని , గౌరవాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ పోస్ట్ బయటకు వచ్చిన కొద్ది నిమిషాల్లోనే వేల సంఖ్యలో లైక్స్, రీట్వీట్లతో సోషల్ మీడియాను ఊపేసింది. నందమూరి అభిమానులు ఈ సందేశాన్ని చూసి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. "బాబాయి అబ్బాయిల అనుబంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలి" అంటూ  అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.  

balakrishna, ntr, gopichand malineni

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.