![]() |
![]() |

ఇరవై ఏళ్ళ క్రితమే ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎన్నో సూపర్ హిట్స్ చూసిన రామ్ పోతినేని ఈ సారి రైటర్, దర్శకుడు, నిర్మాతగా మారి తనే హీరోగా సినిమా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ వచ్చి రాగానే సంచలనానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారుతూనే ఉంది. తాజాగా ఈ కోవలోనే ఒక న్యూస్ తన హవా చాటుతుంది.
RAPO23 గా షూట్ దశలో ఉన్న ఈ చిత్రానికి “Eka – The Lone Wolf” (ఏక - ద లోన్ వోల్ఫ్) అనే పవర్ ఫుల్ టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లు ఫిలిం సర్కిల్స్ టాక్ . కథా నేపథ్యానికి, రామ్ పోషిస్తున్న విలక్షణమైన రోల్ లో 'Eka ' టైటిల్ నూటికి నూరు శాతం సరిగ్గా సరిపోతుందని చిత్ర యూనిట్ బావిస్తుందంట. సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారడంతో రామ్ అభిమానులు ట్రెండింగ్ లోకి వచ్చారు. సుమారు 100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి షూటింగ్ షెడ్యూల్ ఇప్పటికే పుదుచ్చేరిలో వేగంగా ప్రారంభమైంది. రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై ఆయన సోదరుడు కృష్ణ పోతినేని నిర్మిస్తుండగా, సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే, సామ్ సిఎస్ సంగీతం అందిస్తుండగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ తిరు కెమెరా బాధ్యతలను, పీటర్ హెయిన్స్ స్టంట్ పర్యవేక్షిస్తున్నారు.
Also Read: బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్.. ఇచ్చిన వరాలు ఇవే
రామ్ ప్రీవియస్ చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోవడంతో RAPO23
పై ఫ్యాన్స్ తో పాటు రామ్ కొండంత ఆశలు పెట్టుకున్నారు. 'వీర' అనే డైనమిక్ రోల్లో రామ్ కనిపిస్తున్నాడు. పక్కా సైకాలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ కాగా హీరోయిన్ గా ఎవరు కనిపించబోతున్నారో త్వరలోనే అప్ డేట్ రానుంది.
Ram Pothineni, Rapo23, TeluguCinema, TeluguCinema News, TeluguOneDotCom, Tollywood, Tollywood News
![]() |
![]() |