![]() |
![]() |

ప్రముఖ హీరో, నటుడు, నిర్మాత, మెగాస్టార్ చిరంజీవి స్నేహితుడు జీవీ నారాయణ రావు గారు బుధవారం సాయంత్రం చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఈ రోజు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానం ప్రాంగణంలో నారాయణగారి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతు '1977 నుంచి నారాయణరావు నాకు పరిచయం. నేను, నారాయణ, రాజేంద్రప్రసాద్, హరిప్రసాద్ చెన్నై లో ఒకే రూమ్ లో ఉండేవాళ్ళం. తను మాకు సీనియర్, సినిమా గురించి చాలా విషయాలు చెప్తూ సరదాగా ఉండే వాడు. నేను నిలదొక్కుకున్నాకా నిర్మాతగా నాకు చెయ్యాలని అడిగితే వెంటనే చేశాను. అలా ఒక మూడు సినిమాల దాకా నారాయణకి చేశాను. ఆ తర్వాత సినిమాల్లో కూడా నటుడుగా అవకాశాలు ఇప్పించాను. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల మా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందనేది నిజం.
పదిరోజుల క్రితం కలిసి మనవూరి పాండవులు కి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాను, నువ్వు ప్రమోట్ చేయాలంటే సరే అన్నాను. గంట సేపు మాట్లాడుకున్నాకా నాతో ఫోటో కూడా దిగాలని అంటే దిగాను. ఆరోగ్యం జాగ్రత్త అంటే మనకేం కాదు అన్నాడు. కొంచం మొండి మనిషి. వెళ్తున్నప్పుడు ఆల్ ది బెస్ట్ అని చెప్పాను. కానీ అదే గుడ్ బై అవుతుందని అనుకోలేదు. నారాయణ కుటుంబం నా కుటుంబం. ఎక్కడ ఉన్నా అయన ఆత్మకి శాంతిచేకూరాలని కోరుకుంటున్నానని భావోద్వేగంతో చెప్పాడు. నారాయణ రావు వయసు 73 సంవత్సరాలు కాగా పూర్తి పేరు గుళ్ళపల్లి వెంకట నారాయరావు. కృష్ణా జిల్లా, కురుమద్దాలి స్వగ్రామం.

Chiraneevi, GV narayanarao, TeluguCinema, TeluguCinema News, TeluguOneDotCom, Tollywood
![]() |
![]() |