Home  »  News  »  Preity mukhundhan: పవన్ కళ్యాణ్ ఓజీ 2 లో బ్లాస్ట్ బ్యూటీ ప్రీతి ముకుందన్!.. ఫ్యాన్స్ ఏమంటున్నారు 

Updated : Jun 30, 2026

 

ప్రీతి ముకుందన్..సౌత్ సినీ ప్రపంచంలో ఇప్పుడు ఈ పేరు మారుమోగిపోతుంది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై, థియేటర్లలో సైతం సంచలన విజయం సాధించిన యాక్షన్ థ్రిల్లర్ 'బ్లాస్ట్' (Blast) సినిమాతో ఈమె ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కూతురిగా, కరాటే ఫైటర్‌గా ప్రీతి చూపించిన యాక్షన్ సీక్వెన్స్ చూసి ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ల క్యారెక్టర్స్ కేవలం గ్లామర్‌కే పరిమితం అవుతుంటాయి. కానీ, ప్రీతి ముకుందన్ మాత్రం 'బ్లాస్ట్' సినిమాలో రిస్క్ చేసి, శారీరకంగా ఎంతో శ్రమించి ఫైట్లు చేసింది. బాక్సాఫీస్ వద్ద 100% కి పైగా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం, మహిళా ప్రేక్షకులను మరియు ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు భారీగా రప్పిస్తోంది. కేవలం గ్లామర్ పాత్రలకే కాకుండా, నటనకు ప్రాధాన్యం ఉన్న ఇలాంటి యాక్షన్ ఓరియెంటెడ్ పాత్రను ఎంచుకోవడం తాను తీసుకున్న అత్యంత సాహసోపేతమైన, వినూత్నమైన నిర్ణయమని ప్రీతి ముకుందన్ స్వయంగా వెల్లడించింది.

ఈ భారీ సక్సెస్ ఇచ్చిన జోష్‌తో ప్రీతి ముకుందన్ కెరీర్ ఇప్పుడు పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఒక రేంజ్ క్రేజీ రూమర్ హల్‌చల్ చేస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'ఓజీ' (They Call Him OG) చిత్రానికి సంబంధించి తాజాగా మేకర్స్ పార్ట్ 2 ప్రకటన చేశారు. 'ఓజీ 2' (OG 2) పేరుతో ఈ సినిమా యూనివర్స్ మరింత పెద్దది కాబోతుందని, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అధికారికంగా ఒక గ్లింప్స్ వీడియో ద్వారా స్పష్టం చేసింది. ఈ గ్లింప్స్‌లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్‌తో కథా చర్చల్లో పాల్గొంటూ.. 'నేను రెడీ' అని చెప్పడం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే, ఈ భారీ యాక్షన్ ప్రొజెక్ట్ 'ఓజీ 2' లో ఒక కీలకమైన, పవర్‌ఫుల్ లేడీ యాక్షన్ పాత్ర కోసం దర్శకుడు సుజీత్ ప్రస్తుతం ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న ప్రీతి ముకుందన్‌ను సంప్రదించినట్లు టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా ప్రచారం సాగుతోంది.

Also read: Prabhas: ప్రభాస్‌ని అడిగితే 3 కోట్లు ఇచ్చేస్తాడు..  కృష్ణ మాయ 


'బ్లాస్ట్' లో ప్రీతి చేసిన ఒళ్ళు గగుర్పొడిచే స్టంట్స్, మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ చూసిన తర్వాతే సుజీత్ ఆమెను 'ఓజీ 2' లోని ఒక వినూత్న క్యారక్టర్  కోసం సంప్రదించినట్టుగా టాక్. ఒకవేళ ఇదే నిజమైతే, పవన్ లాంటి బిగ్గెస్ట్  స్టార్ తో  ఛాన్స్ రావడం ప్రీతి ముకుందన్ కెరీర్‌ని  మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయం. ప్రస్తుతం ప్రీతి తెలుగులో రోషన్ మేక సరసన 'ఏమో ఏమో ఇది' అనే లవ్ స్టోరీలో నటిస్తోంది. తమిళంలో అథర్వ మురళితో చేసిన  'ఇదయం మురళి' జూలై 10న విడుదల కాబోతోంది. ఒకవైపు గ్లామర్, మరోవైపు 'బ్లాస్ట్' లాంటి లేడీ ఎంపవర్‌మెంట్ యాక్షన్ చిత్రాలతో మెప్పిస్తున్న ఈ ముద్దుగుమ్మ, పవన్ కళ్యాణ్ 'ఓజీ 2' క్రేజీ కాస్టింగ్ రూమర్లతో టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా నిలిచింది.

 


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.