Home

»

Latest News

Prabhas: ప్రభాస్‌ని అడిగితే 3 కోట్లు ఇచ్చేస్తాడు..  కృష్ణ మాయ 

Jun 30, 2026 4:59PM

 

 

రెబల్ స్టార్ ప్రభాస్ తొలి చిత్రం 'ఈశ్వర్' సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎవరూ అంత సులభంగా మర్చిపోలేరు. ఆ సినిమాలో ప్రభాస్ స్నేహితుడిగా నటించి మెప్పించిన నటుడు, ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ కృష్ణ మాయ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి పలు సంచలన, ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. .

ప్రభాస్ అనే వ్యక్తి ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ, కేవలం తన సొంత కష్టంతో, తిరుగులేని ఇమేజ్‌తో చిరుత పులి' లాంటి బ్రాండ్‌ క్రియేట్ చేసుకున్నారు. ప్రభాస్ యాక్టింగ్ లో ఒక ప్రత్యేకమైన వేరియేషన్ ఉంటుంది. అప్పట్లో ప్రభాస్ ఎంతో  సాధారణంగా ఉండేవారు. ఒకరోజు షూటింగ్ కోసం ప్రభాస్ తమతో పాటే ఒక సాధారణ డీసీఎం (DCM) వ్యాన్ ఎక్కి చార్మినార్‌కి  వచ్చారు. అంతటి పెద్ద కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిలో ఆ సింప్లిసిటీని చూసి తామంతా ఆశ్చర్య పోయాం. అప్పుడున్న ప్రభాస్‌కు, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న గ్లోబల్ స్టార్ ప్రభాస్‌కి  వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు రాలేదు.

'ఫౌజీ' (Fauji)  షూటింగ్ దగ్గరకి వెళ్ళాను. కానీ ఇప్పుడు ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోవడంతో, ఆయన దగ్గరకు వెళ్ళి మాట్లాడటానికి మొదట కొంచెం సిగ్గుగా, సంకోచంగా అనిపించింది. కానీ ప్రభాస్ నన్ను చూడగానే గుర్తుపట్టి, ఎంతో ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. ఒక పాత స్నేహితుడిని చూసిన ఆనందం ప్రభాస్ కళ్లల్లో స్పష్టంగా కనిపించింది.  నా  చేయి పట్టుకుని మరీ ఎంతో ప్రేమగా మాట్లాడారు. నీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? ఏదైనా సమస్య ఉంటే మొహమాటం లేకుండా చెప్పు" అని ఆరా తీశారని కృష్ణ మాయ ఎమోషనల్ అయ్యారు. ఒకవేళ నేను ప్రభాస్‌ ని అడిగితే రెండు నుండి మూడు కోట్లు తక్షణమే ఇచ్చేంత ఆర్థిక కెపాసిటీ, అంతకంటే గొప్ప మనసు ఆయన సొంతమని కృష్ణ మాయ స్పష్టం చేశారు. అయితే, తానే ఎప్పుడూ అలా అడగలేదని, ఒకవేళ అలా డబ్బులు అడిగితే తమ మధ్య ఉన్న పవిత్రమైన స్నేహ బంధంతో పాటు ఆ మర్యాద కూడా  పోతుంది. నాకు ప్రస్తుతానికి డబ్బుల అవసరం లేదు. , తనకు తానుగా కష్టపడి సంపాదించుకుంటున్నానని, ప్రభాస్ చూపించిన ఆ ఆప్యాయత, గౌరవమే తనకు కోట్ల కంటే ఎక్కువని కృష్ణ మాయ ఈ ఇంటర్వ్యూలో గర్వంగా వెల్లడించారు.


Also read: Chiranjeevi: చిరంజీవిపై మురళీ మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు 


నటుడిగానే కాకుండా దాదాపు 80 కి పైగా చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా విజయవంతంగా పనిచేసిన కృష్ణ మాయ, ఆ తర్వాత దర్శకుడిగా మారి టాలీవుడ్‌లో 'దొంగల ముఠా', 'రైల్వే స్టేషన్' వంటి సినిమాలను తెరకెక్కించారు. ప్రభాస్ స్టార్డమ్, ఆయనకున్న అపారమైన మానవత్వం గురించి కృష్ణ మాయ మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com