![]() |
![]() |

-సంచలనం సృష్టిస్తున్న యష్ టాక్సిక్
-టీజర్ లో ఏముంది
-యష్ కి ఇక చుక్కలేనా!
-చర్యలు ఉంటాయా!
పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద కేజిఎఫ్ సిరీస్ తో రాక్ స్టార్ యష్(Yash)కి ఏర్పడిన క్రేజ్ తెలిసిందే. దీంతో ప్రస్తుతం యష్ చేస్తున్న టాక్సిక్(Toxic)పై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.అందుకు తగ్గట్టే ఒక డిఫరెంట్ సబ్జెట్ తో టాక్సిక్ రూపొందనుంది. ఇటీవల రిలీజైన టీజర్ నే అందుకు ఉదాహరణ. ఎవరు ఊహించని విధంగా విదేశీ నటుల మధ్య యాక్షన్ ఎపిసోడ్ నేపథ్యంతో కట్ చేసిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. అదే సమయంలో టీజర్ చుట్టూ ఇప్పుడు వివాదాలు అల్లుకుంటున్నాయి. మరి అసలు విషయం చూద్దాం.
టాక్సిక్ టీజర్ లో యష్ ఒక పెద్ద కారులో ఒక మహిళతో రొమాన్స్ చేసే ఇంటిమేట్ సన్నివేశం చాలా శృతిమించి ఉంది. దీంతో కర్ణాటక(Karnataka)ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర మహిళా కమిషన్ ని సంప్రదించి టాక్సిక్ టీజర్ లోని అసభ్యకర సన్నివేశాలు పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి.కాబట్టి సోషల్ మీడియా నుంచి టీజర్ ని తొలగించాలి. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని పేర్కొంది. దీంతో వెంటనే మహిళా కమిషన్ సెన్సార్ బోర్డ్ కి లేఖ రాసింది. సదరు లేఖ లో టాక్సిక్ టీజర్ అంశంపై తగిన చర్యలు తీసుకొని నివేదిక సమర్పించాలని పేర్కొనడంతో టాక్సిక్ టీజర్ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Also read: భర్త మహాశయులుకు విజ్ఞప్తి హైలెట్స్ ఇవేనా!
కెజిఎఫ్ సిరీస్ తో వచ్చిన గ్లోబల్ ఇమేజ్ తో ఎలాంటి సబ్జెట్ లో చెయ్యాలని అలోచించిన యష్ సుమారు నాలుగేళ్ళ గ్యాప్ తర్వాత టాక్సిక్ చేస్తున్నాడు. మహిళా దర్శకురాలు గీతు మోహన్ దాస్(Geetu MOhandas)తెరకెక్కిస్తోంది. 2019 లో వచ్చిన మొథాన్ అనే మూవీ తర్వాత టాక్సిక్ తోనే గీతు మోహన్ దాస్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. యష్, వెంకట్ కె నారాయణ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుండగా కైరా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ ఇతర ముఖ్యమైన క్యారెక్టర్స్ లో కనిపిస్తున్నారు. రవి బర్సుర్ మ్యూజిక్ కాగా మార్చి 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కూడా విడుదలవుతున్న విషయం తెలిసిందే.
![]() |
![]() |