![]() |
![]() |

-ఫ్యాన్స్, ప్రేక్షకులు ఏమంటున్నారు
-రవితేజ హిట్ అందుకున్నాడా!
-రివ్యూస్ ఎలా వస్తున్నాయి
-ప్రధాన హైలెట్స్ ఇవేనా!
మాస్ మహారాజా రవితేజ(Ravi Teja)తన రెగ్యులర్ జోనర్ కి కొద్దిగా సైడ్ ఇచ్చి రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ భర్త మహాశయులుకు విజ్ఞప్తి(Bhartha Mahasayulaku Wignyapthi)తో ఈ రోజు థియేటర్స్ లో అడుగుపెట్టాడు. రామ్, సత్య అనే క్యారెక్టర్స్ లో రవితేజ పెర్ ఫార్మ్ సూపర్ గా ఉందని,ఆషికా రంగనాధ్, సునీల్,వెన్నెల కిషోర్, మురళి ధర్ గౌడ్ పోషించిన క్యారెక్టర్స్ కూడా అలరిస్తున్నాయనే అభిప్రాయాన్ని మూవీ చూసిన ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. రివ్యూస్ కూడా పర్వాలేదనే స్థాయిలోనే వస్తున్నాయి.మరి అంతలా అలరించాడనికి దోహదపడిన అంశా లేమిటో చూద్దాం.
1 .రవితేజ ఎనర్జిటిక్ పెర్ ఫార్మెన్స్, కామెడీ టైమింగ్
2 . ఆషికా రంగనాధ్ స్క్రీన్ ప్రెజెన్స్, క్యారక్టర్ నడిచిన తీరు
3 . రవితేజ, ఆషికా మధ్య వచ్చిన సీన్స్
4 . సునీల్ కామెడీ టైమింగ్
5 వెన్నెల కిషోర్,రవితేజ, సునీల్ మధ్య వచ్చిన సీన్స్
6 ,ఇంటర్వెల్ ఎపిసోడ్
7 . ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్
8 . రెండు సాంగ్స్
9 . డైలాగ్స్
ఇక రవితేజ అభిమానులు, ప్రేక్షకులతో థియేటర్స్ దగ్గర సందడి వాతావరణం నెలకొని ఉంది. మరి ప్రస్తుతం పర్లేదనే టాక్ వస్తున్న నేపథ్యంలో భర్త మహాశయులుకు విజ్ఞప్తి హిట్ రేంజ్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. కిషోర్ తిరుమల(KIshore Tirumala) దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించగా భీమ్స్ మ్యూజిక్ ని అందించాడు.
![]() |
![]() |