![]() |
![]() |
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'భోళా శంకర్'. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, కీర్తి సురేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమిళ చిత్రం 'వేదాళం'కి రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఆగస్టు 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు రెండు నెలల ముందే 'భోళా మేనియా' అంటూ ప్రమోషన్స్ ని షురూ చేసింది మూవీ టీం. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది.
మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న 'భోళా శంకర్' మూవీ నుంచి 'భోళా మేనియా' అనే సాంగ్ లిరికల్ వీడియోని ఈరోజు(జూన్ 4) విడుదల చేశారు. భోళా శంకర్ పాత్రను పరిచయం చేస్తూ సాగిన ఈ ఎనర్జిటిక్ సాంగ్ ఆకట్టుకుంటోంది. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి. మహతి స్వర సాగర్, రేవంత్ ఈ సాంగ్ ని అంతే ఎనర్జిటిక్ గా ఆలపించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. లిరికల్ వీడియోలో మెగాస్టార్ స్టెప్పులతో అదరగొట్టారు. ఎప్పటిలాగే తనదైన డ్యాన్స్ తో మ్యాజిక్ చేశారు. ముఖ్యంగా కీ చైన్ స్టెప్ తో కట్టిపడేసారు. మొత్తానికి ఈ పాటలో తన డ్యాన్స్ తో థియేటర్స్ లో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వడం ఖాయమనిపిస్తోంది.
![]() |
![]() |