మహేశ్‌బాబు కెరీర్‌లోని బ్లాక్‌బస్టర్ మూవీస్‌లో 'దూకుడు' ఒకటి. శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన ఈ మూవీ 2011 సెప్టెంబర్ 23న విడుదలైంది. అంటే నేటికి సరిగ్గా పదేళ్లు. తెలుగునాటే కాకుండా ఓవర్సీస్లోనూ కలెక్షన్ల వర్షం కురిపించిన 'దూకుడు'.. అప్పటికి మహేశ్ కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలవడమే కాకుండా, ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది.
కాగా, 'దూకుడు' విడుదలై దశాబ్దం నిండిన సందర్భంగా ఆ సినిమా సాధించిన గ్రాండ్ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు సూపర్‌స్టార్ ఫ్యాన్స్. సోషల్ మీడియాలో #DecadeForIHDookudu అనే హ్యాష్‌ట్యాగ్‌ను వైరల్ చేశారు. అంతేకాదు, ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో 'దూకుడు' స్పెషల్ షోస్ వేస్తున్నారు. అలాగే బెంగళూరులోనూ వేస్తుండటం గమనార్హం. ఈ స్పెషల్ షోస్‌కు మహేశ్ ఫ్యాన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చిందంటున్నారు.
ఆన్లైన్లో టికెట్ల అమ్మకం ప్రారంభించిన కొద్ది సేపట్లోనే పలు థియేటర్లలో టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్ల దగ్గర హౌస్‌ఫుల్ బోర్డ్ కనిపించడం అరుదుగా మారిందనీ, 'దూకుడు' స్పెషల్ షోలు హౌస్‌ఫుల్ అవడం విశేషమనీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
'దూకుడు' స్పెషల్ షోస్ లిస్ట్ (సెప్టెంబర్ 23)
హైదరాబాద్ - సుదర్శన్ 35 ఎంఎం - రాత్రి 9 గంటలు
ఖమ్మం - వినోద - రాత్రి 9 గంటలు
విజయవాడ - అన్నపూర్ణ - రాత్రి 7:30 గంటలు
విశాఖపట్నం - శరత్ - సాయంత్రం 6:30 గంటలు
కాకినాడ - సి అండ్ సి - రాత్రి 7:30 గంటలు
నెల్లూరు - సిరి - సాయంత్రం 6:30 గంటలు
సిరి (స్క్రీన్ 4) - సాయంత్రం 6:30 గంటలు
అనంతపురం - శాంతి - సాయంత్రం 6 గంటలు
రాజమండ్రి - సూర్య ప్యాలెస్ - రాత్రి 8:30 గంటలు
నంద్యాల - శ్రీరామ - రాత్రి 7 గంటలు
భీమవరం - పద్మాలయ మినీ - రాత్రి 8 గంటలు
నరసింహపురం - కనకదుర్గ - సాయంత్రం 6:30 గంటలు
కడప - ప్రతాప్ - రాత్రి 9 గంటలు
కొవ్వూరు - అనన్య - సాయంత్రం 6 గంటలు
తిరుపతి - కృష్ణతేజ - సాయంత్రం 6:30 గంటలు
ప్రొద్దుటూరు - అర్చన - సాయంత్రం 6:30 గంటలు
ఒంగోలు - గోరంట్ల - రాత్రి 7:30 గంటలు
కర్నూలు - శ్రీరామ - రాత్రి 9 గంటలు
శ్రీకాకుళం - మారుతి - సాయంత్రం 6 గంటలు
బెంగళూరు - అంజన్ - సాయంత్రం 6 గంటలు