![]() |
![]() |

'అతడు', 'ఖలేజా' సినిమాల తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం 'ఎస్ఎస్ఎంబి 28'(వర్కింగ్ టైటిల్). హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన మహేష్ ఫస్ట్ లుక్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మహేష్ మాస్ లుక్ ఆకట్టుకుంది. త్రివిక్రమ్ రెగ్యులర్ సినిమాల తరహాలో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లా కాకుండా.. ఫస్ట్ లుక్ మాదిరిగానే పక్కా మాస్ సినిమా రూపొందిస్తే బాగుంటుందనే అభిప్రాయం మహేష్ ఫ్యాన్స్ లో ఉంది. అయితే ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే అప్డేట్ వచ్చింది.
ఇటీవల కాలంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన మాస్ సినిమా అంటే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'అరవింద సమేత వీర రాఘవ' అని చెప్పొచ్చు. ఇందులో బసిరెడ్డి అనే నెగటివ్ రోల్ లో జగపతి బాబు నటించారు. ఆ పాత్రను మలిచిన తీరు, గెటప్ ఎంత క్రూరంగా ఉంటాయో తెలిసిందే. అయితే ఇప్పుడు 'ఎస్ఎస్ఎంబి 28'లో జగపతి బాబు అంతకంటే క్రూరమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పడం విశేషం. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ఎస్ఎస్ఎంబి 28'లో తన పాత్ర బసిరెడ్డి పాత్ర కంటే క్రూరంగా, భయంకరంగా ఉంటుందని జగపతి బాబు చెప్పారు. ఆయన మాటలను బట్టి చూస్తుంటే.. మహేష్ ఫ్యాన్స్ ఊహించిన దానికంటే ఎక్కువగా ఊర మాస్ ఫిల్మ్ ని త్రివిక్రమ్ అందించబోతున్నట్లు అర్థమవుతోంది.
![]() |
![]() |