![]() |
![]() |

తాజాగా 'ఏజెంట్'తో మరో ఫ్లాప్ అందుకున్నాడు అక్కినేని అఖిల్. ఇప్పటిదాకా అఖిల్ హీరోగా నటించిన ఐదు సినిమాలు విడుదల కాగా.. అందులో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' తప్ప మిగతావన్నీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్స్ గా మిలిగాయి. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఎంతో నిరాశలో ఉన్నారు. ఆయనను సినిమాల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు. ఈ క్రమంలో అఖిల్ తదుపరి సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన న్యూస్ వినిపిస్తోంది. చేసిన ఐదు సినిమాల్లో నలుగురు సీనియర్ దర్శకులతో పని చేసిన అఖిల్.. మొదటిసారి పూర్తిగా ఓ కొత్త దర్శకుడితో పని చేయబోతున్నట్లు తెలుస్తోంది.
అఖిల్ తన ఆరో సినిమాని యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో చేయబోతున్నట్లు సమాచారం. 'సాహో' సినిమాకి దర్శకత్వ విభాగంలో పని చేసిన అనిల్ కుమార్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడట. ఇదొక ఫాంటసీ ఫిల్మ్ అని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని, ఇప్పటికే హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని ఎంపిక చేశారని వినికిడి. నిజానికి ఈ సినిమాని ఏజెంట్ విడుదలైన వెంటనే అధికారికంగా ప్రకటించాలి అనుకున్నారట. అయితే ఏజెంట్ ఫలితం నిరాశపరచడంలో కాస్త ఆలస్యంగా ప్రకటించే అవకాశముంది అంటున్నారు.
![]() |
![]() |