![]() |
![]() |

నైన్‌టీస్ కిడ్స్ ని ఎవరిని కదిలించినా ఎ.ఆర్.రెహమాన్ పాటలను వినకుండా పెరిగాం అనే మాటను అస్సలు వినలేం. సాపాసాలన్నీ రెహమాన్ స్టైల్‌లో సరికొత్తగా వినిపించిన రోజులవి. రోజా, ఆశ, బాంబాయ్, దొంగ దొంగ... ఒకటా రెండా చెప్పుకుంటూ పోవచ్చు. ఒక్కో పాటా ఆయనకి ఒక్కో ఆస్కార్ అంత పాపులారిటీని తెచ్చిపెట్టింది. అయితే ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని ఇష్టపడేవాళ్లందరూ ఎ.ఆర్.రెహమాన్ స్వరాన్ని ఇష్టపడతారా? పడరా? అసలు రెహమాన్‌కి పాటలు పాడాలని ఎప్పుడు అనిపించింది? ఇప్పటిదాకా ఎవరికీ రాని ఈ అనుమానానికి స్పష్టంగా సమాధానమిచ్చారు రెహమాన్.
``నా గొంతు బావుంటుందని నాతో ఫస్ట్ చెప్పింది నా భార్య సైరా భాను. మీ గొంతు చాలా బావుంటుంది. మీరు మాట్లాడుతుంటేనే వినాలనిపిస్తుంటుంది. మీరు పాట పాడితే ఇంకా బావుంటుంది. మీ ఫ్యాన్స్ కి ఇది ఎక్స్ ట్రా ట్రీట్ ఇచ్చినట్టుంటుంది అని నాతో చాలా సార్లు చెప్పింది. ఆ మాటకొస్తే, నా గొంతు బావుంటుందనే మాట అంతకు ముందు నాతో ఎవరూ చెప్పలేదు. నా భార్య పదే పదే చెబుతుండటంతో నేను కూడా పాటలు పాడటం మొదలుపెట్టాను. వాయిస్ పెక్యులియర్‌గా ఉందని చాలా మంది చెప్పసాగారు. ఆ మాటలను నా భార్య ఆస్వాదిస్తుంటుంది. నా పాటలనే కాదు, నేను పలు సందర్భాల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలను కూడా మళ్లీ మళ్లీ వింటూ ఉంటుంది. అందరూ నా సంగీతంతో ప్రేమలో పడితే, మా ఆవిడ నా స్వరంతో ప్రేమలో పడింది`` అని అన్నారు. ఇటీవల వికటన్ అవార్డుల వేడుకలో ఈ విషయాన్ని పంచుకున్నారు రెహమాన్. అదే స్టేజీ మీద సైరాభానుకి మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఆమె మైక్ అందుకోగానే ``హిందీలో కాదు, తమిళంలో మాట్లాడండి ప్లీజ్`` అంటూ చమత్కరించారు రెహమాన్. తమిళ్ తనకు పెద్దగా రాదని హిందీలో మాట్లాడారు సైరా. రెహమాన్ స్వరంతో ప్రేమలో పడ్డానని అన్నారు.
![]() |
![]() |