![]() |
![]() |

కోలీవుడ్ స్టార్ సూర్య(Suriya) తన 46వ సినిమాని వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్ర టైటిల్ ని తాజాగా రివీల్ చేశారు. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే ఈ సినిమాకి 'విశ్వనాథ్ & సన్స్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అలాగే ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. దాంతో పాటు, విడుదల తేదీపై కూడా క్లారిటీ ఇచ్చారు. (Vishwanath & Sons)
'విశ్వనాథ్ & సన్స్' ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. సూర్య ఒక చిన్నారిని ఎత్తుకొని కూల్ గా కనిపిస్తున్నాడు. పోస్టర్ చూస్తుంటే ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపిస్తోంది. సూర్య లుక్ కూడా క్లాసీగా ఉంది. వింటేజ్ సూర్య గుర్తుకొస్తున్నాడు.
ఇప్పటికే 'విశ్వనాథ్ & సన్స్' షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. జూలైలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. జూలై 23న సూర్య పుట్టినరోజు. ఆయన బర్త్ డే కానుకగా ఆ తేదీకి సినిమా విడుదలయ్యే ఛాన్స్ ఉంది. త్వరలోనే టీజర్ ను కూడా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న 'విశ్వనాథ్ & సన్స్'లో మమిత బైజు, రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా నిమిష్ రవి, ప్రొడక్షన్ డిజైనర్ గా బంగ్లాన్, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు.
సూర్య కమర్షియల్ సక్సెస్ చూసి చాలా కాలమైంది. ఆకాశం నీ హద్దురా, జై భీమ్ వంటి సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి. థియేటర్లలో ఓ సాలిడ్ సక్సెస్ కోసం చూస్తున్న సూర్య.. 'విశ్వనాథ్ & సన్స్'తో కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి.
'సార్', 'లక్కీ భాస్కర్' సినిమాల తరువాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో 'విశ్వనాథ్ & సన్స్' కంటెంట్ పై ప్రేక్షకుల్లో నమ్మకం ఉంది. ఆ సినిమాల తరహాలో కంటెంట్ క్లిక్ అయితే సూర్య ఖాతాలో హిట్ పడినట్లే.
సూర్య 'కరుప్పు' అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఆర్జే బాలాజీ డైరెక్ట్ చేస్తున్న ఈ ఫిల్మ్ కూడా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటితో పాటు 'ఆవేశం' ఫేమ్ జీతూ మాధవన్ దర్శకత్వంలోనూ సూర్య ఒక సినిమా చేస్తుండటం విశేషం.
https://x.com/Theteluguone/status/2028346409955795235?s=20
![]() |
![]() |