![]() |
![]() |

-డైరెక్టర్ చిదంబరంపై లైంగిక వేధింపుల కేసు
-మంజుమ్మల్ బాయ్స్ తో పాన్ ఇండియా వ్యాప్తంగా క్రేజ్
-ఆరోపణలు చేస్తుంది ఎవరు!
-నోటీసులు జారీ అయ్యాయా!
డీటెయిల్స్ చూద్దాం
కథ,కథనం అనేవి సినీ అడ్రెస్స్ లేని నటుల్ని, మేకర్స్ ని ఓవర్ నైట్ స్టార్స్ ని చేస్తాయని నిరూపించిన చిత్రం మంజుమ్మల్ బాయ్స్'. అది కూడా పాన్ ఇండియా స్టార్స్ గా అవతరించేలా చేసింది. దీన్ని బట్టి ఆ చిత్రం సృష్టించిన ప్రభంజాన్ని అర్ధం చేసుకోవచ్చు. 2024 లో రిలీజైనా కూడా సినిమా ప్రేమికులు అయితే నిద్రలో లేపి అడిగినా మూవీలోని సీన్స్ ని పిన్ టూ పిన్ చెప్తారు. అంతటి ప్రత్యేకతని సంతరించుకున్న మంజుమ్మల్ బాయ్స్ తన సినీ హిస్టరీ లో ఒక మరకని అంటించుకుంది. దర్శకుడు చిదంబరం(Chidambaram s.Poduval)పై వస్తున్న ఆరోపణలే అందుకు కారణం. పూర్తి మ్యాటర్ చూద్దాం
రీసెంట్ గా కేరళలోని ఎర్నాకులం(Ernakulam)పోలీస్ స్టేషన్ లో చిదంబరం పై ఒక మహిళ లైంగిక వేధింపుల కేసు నమోదు చేసింది. సదరు ఫిర్యాదులో 2021 వ సంవత్సరంలో చిదంబరం లైంగికంగా తనని వేధించినట్టుగా పేర్కొంది. ఈ నేపథ్యంలో పోలీసులు చిదంబరంపై కేసు నమోదు చేసి విచారణకి హాజరు కావాలని నోటిసులు పంపించారు. ఇప్పుడు ఈ విషయం కేరళ సినిమా పరిశ్రమలో వైరల్ గా మారింది. మంజుమ్మల్ బాయ్స్ పుణ్యమా అని సౌత్ లో కూడా కేసు విషయం గురించి అందరు మాట్లాడుకుంటున్నారు. మరి ఆరోపణలపై చిదంబరం ఎలాంటి సమాధానం ఇస్తాడనే ఆసక్తి అందరిలో ఏర్పడింది.
also read: Balakrishna: చరిత్ర సృష్టించేవాడు ఒక్కడే.. ఆ చరిత్ర నాదే
చిదంబరం సినీ జర్నీ విషయానికి వస్తే 2021 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'జాన్ ఈ మాన్' తొలి చిత్రం. మంజుమ్మేల్ బాయ్స్ సెకండ్ మూవీ. ఆ రెండు చిత్రాలతో నిజ జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తాడనే బ్రాండ్ ఏర్పడింది. ప్రస్తుతం తన కొత్త చిత్రానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాడు. పూర్తి పేరు చిదంబరం ఎస్ పోదువాల్..
![]() |
![]() |