![]() |
![]() |

ఈ మధ్య కాలంలో ఒకరికంటే ఎక్కువ మంది హీరోయిన్స్ సెల్యులాయిడ్ పై సందడి చేసిన దాఖలాలు లేవు. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ మాత్రమే ఇద్దరు, ముగ్గురు హీరోయిన్స్ తో అభిమానులు, ప్రేక్షకులని కనువిందు చేస్తుంటాడు. ఇప్పుడు యష్ 'టాక్సిక్ లో నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా వంటి అగ్ర హీరోయిన్ లు సందడి చేయనున్నారు. రీసెంట్ గా ఈ నలుగురు భామల పారితోషికాల వివరాలు ఇవే అంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్‌గా మారాయి.
సొగసరి కియారా అద్వానీ ఈ సినిమాలో 'నాడియా' అనే గ్లామరస్ అండ్ పవర్ ఫుల్ రోల్ లో నటిస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ కోసం కియారా దాదాపు 15 కోట్ల భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. తన కెరీర్‌లోనే ఇది అత్యధిక పారితోషికం కావడం గమనార్హం. గత సినిమాలతో పోలిస్తే కియారా దాదాపు 100 శాతానికి పైగా పారితోషికం పెంచేసినట్లు తెలుస్తోంది. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ చిత్రంలో 'గంగా' అనే ఒక కీలకమైన మరియు ప్రాధాన్యత ఉన్న రోల్ లో కనిపించనున్నారు. దక్షిణ భారత దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా గుర్తింపు పొందిన నయనతార, టాక్సిక్ మూవీ కోసం 12 కోట్ల నుంచి 18 కోట్ల మధ్య తీసుకున్నట్టు టాక్ . వీరితో పాటు కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ కూడా ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాత్రలో అలరించబోతోంది. ఈమెకు మేకర్స్ దాదాపు 5 కోట్ల పారితోషికం చెల్లించారని తెలుస్తోంది. మరో గ్లామర్ క్వీన్ తారా సుతారియా 3 కోట్లు, హుమా ఖురేషియా 2 కోట్లు అందుకుంటున్నట్లు సమాచారం. ఇలా అంతర్జాతీయ స్థాయి నటీనటులు మరియు దిగ్గజ సాంకేతిక నిపుణులతో రూపొందుతున్న 'టాక్సిక్' ఆగస్ట్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది.
Also rea: భర్తకి ఆ పూజ చేసిన ప్రణీత.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ తుఫాన్
యష్ 50 కోట్ల భారీ పారితోషికాన్ని సొంతం చేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఈ భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ను కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా 158 ఫేమ్ వెంకట్ కె. నారాయణ నిర్మించాడు. విశ్లేషకుల అంచనా ప్రకారం చిత్ర బడ్జెట్ 400 కోట్లు అంటున్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకురాలు.
![]() |
![]() |