![]() |
![]() |

కికు యనమల, కశిష్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'కికు చిరంజీవి'. శుభ సాయి వెంకట్ దర్శకత్వంలో దీప్తి నడిమింటి నిర్మించిన ఈ సినిమా, ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఒక అరుదైన ఆరోగ్య సమస్య, విచిత్రమైన ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం.
కథ:
హీరో చిరంజీవి (కికు యనమల) ఒక ఫోటోగ్రాఫర్. చిన్నప్పటి నుంచీ అనాథగా పెరిగిన చిరుకి ఓ అరుదైన ఆరోగ్య సమస్య ఉంటుంది. అందరిలా గుండె ఎడమవైపు కాకుండా కుడివైపు ఉంటుంది. మరోవైపు హీరోయిన్ మను (కశిష్ ఖాన్) కూడా అనాథే. అనుకోకుండా ఒక టూర్ లో కలిసిన వీరిద్దరూ దగ్గరవుతారు. అయితే మనుని ప్రేమించిన ప్రతి ఒక్కరిని ఓ అజ్ఞాత వ్యక్తి తన మనుషులతో చంపేస్తుంటాడు. ఈ విషయం మనుకి కూడా తెలియదు. చిరంజీవి, మను ప్రేమించుకోవడంతో.. చిరుని కూడా చంపేందుకు ప్రయత్నిస్తారు. అయితే వారి నుంచి తప్పించుకొని.. చిరు-మను పెళ్లి చేసుకుంటారు. కానీ, శోభనం రాత్రి తర్వాత మనుకి షాకింగ్ విషయం తెలుస్తుంది. ఫస్ట్ నైట్ మరుసటి రోజు ఉదయం మను లేచి చూసేసరికి.. కుడివైపు ఉండాల్సిన చిరంజీవి గుండె ఎడమవైపు కొట్టుకుంటుంది. ఒక్క రాత్రిలో గుండె ప్లేస్ ఎలా మారింది? అసలు అతను నిజమైన చిరంజీవా లేక వేరే ఎవరైనా వచ్చారా? అసలు హత్యలు చేస్తున్న అజ్ఞాత వ్యక్తి ఎవరు? అతని లక్ష్యం ఏంటి? చిరంజీవి గతం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
"గుండె కుడివైపు ఉంటే" అనే కాన్సెప్ట్ తో ఇప్పటికే ఒకట్రెండు సినిమాలు వచ్చాయి. అయితే కాన్సెప్ట్ ఇప్పటికే వచ్చినదే అయినప్పటికీ, దానిని కొత్తగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగానే నడుస్తుంది. క్యారెక్టర్ల పరిచయం, టూర్, లవ్ సీన్స్ తో నడుస్తుంది. ఫారెస్ట్ ఎపిసోడ్స్ పరవాలేదు. అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం మైండ్ బ్లాక్ చేస్తుంది.
ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకి అసెట్ అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్‌లోకి అడుగుపెట్టగానే కథలోని అసలు సస్పెన్స్, డ్రామా ఊపందుకుంటాయి. ఛేజింగ్ సీన్స్ అయితే ప్రేక్షకులని సీటు అంచున కూర్చోబెడతాయి. అలాగే హీరో, హీరోయిన్ పాత్రల మధ్య సంఘర్షణ కట్టిపడేస్తుంది. తల్లీకొడుకుల ఎమోషన్ కూడా మెప్పించింది. ముఖ్యంగాసెకండ్ హాఫ్ లో ట్విస్ట్ లు అదిరిపోతాయి. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్లు కాస్త నెమ్మదించినా, సెకండ్ హాఫ్‌లో వచ్చే ట్విస్టులు సినిమాని నిలబెట్టాయి. క్లైమాక్స్ లో ఎమోషన్స్ కూడా బాగానే పండాయి.
నటీనటుల విషయానికి వస్తే, కొత్త నటుడైన కికు యనమల తన రోల్‌కి పూర్తి న్యాయం చేశాడు. ఎమోషన్స్, యాక్షన్ సీన్స్‌లో సహజంగా నటించాడు. మొదటి సినిమాకే మంచి పరిణతి చూపించాడు. కశిష్ ఖాన్ తన గ్లామర్ అండ్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. ఈశ్వరీరావు, తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి సీనియర్ యాక్టర్స్ తమ అనుభవంతో కథకి మరింత బలాన్ని చేకూర్చారు.
సినిమాలోని టెక్నికల్ అంశాలను చూస్తే.. శేఖర్ చంద్ర అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి సస్పెన్స్ సీన్‌కి ప్రాణం పోసింది. ఛోటా కే ప్రసాద్ ఎడిటింగ్ కథను పరుగులు పెట్టించడంలో తోడ్పడింది. అయితే ఫస్ట్ హాఫ్ ఇంకా షార్ప్ గా ఉండాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ఫైనల్ గా చెప్పాలంటే.. ఫస్ట్ హాఫ్ లో కాస్త తడబాటు ఉన్నప్పటికీ, ఒక విభిన్నమైన మెడికల్ అండ్ సర్వైవల్ సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలనుకునే వారికి 'కికు చిరంజీవి' మంచి ఛాయిస్.
రేటింగ్: 2.75/5
Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.
[Kiku Chiranjeevi, Movie Review, Telugu Cinema]
![]() |
![]() |