Home  »  News  »  Toxic: యష్ ని మా రాష్ట్రంలో ఉండనివ్వం.. టాక్సిక్ పై ప్రముఖ నటి ఆగ్రహం

Updated : Aug 13, 2026

 


యష్ వన్ మాన్ షో  టాక్సిక్ ఈ నెల 26న వరల్డ్ వైడ్ గా విడుదలవుతున్న విషయం తెలిసిందే రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ తో అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి. అదే టైం లో  బోల్డ్ సన్నివేశాలు ఉన్నాయనే విషయం కూడా అర్ధం అవుతుంది.

 రీసెంట్ గా కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి రిషికా సింగ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు 'టాక్సిక్  ట్రైలర్‌లో ప్రదర్శించిన అశ్లీలత చూసి  తీవ్రంగా నిరాశ చెందుతున్నాను. నిజ జీవితంలో ఒక బాధ్యతాయుతమైన భర్తగా, ఇద్దరు పిల్లలకు తండ్రిగా ఉన్న యష్ నుంచి సమాజం, ముఖ్యంగా మహిళలు మరింత గౌరవాన్ని  బాధ్యతాయుత ప్రవర్తనని  ఆశిస్తారు.నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ వంటి ఐదుగురు అగ్రశ్రేణి కథానాయికలు నటిస్తున్నప్పటికీ, వారి క్యారెక్టర్స్ ని కేవలం గ్లామర్, భోగవస్తువులుగానే చూపించడం ఏమాత్రం సహించరాని విషయం.  భారతీయ సంస్కృతిని, మహిళల గౌరవాన్ని కాపాడలేనప్పుడు, మహిళలను గౌరవించడం చేతకాకపోతే మిమ్మల్ని కర్ణాటక నేల వదిలి వెళ్ళేలా చేస్తాం. దర్శకురాలు గీతు మోహన్‌దాస్ కర్ణాటక ప్రాంతానికి చెందినవారు కాకపోవడం వల్ల ఆమెకు ఇక్కడి సాంప్రదాయాలు, విలువలు తెలియకపోవచ్చు. కానీ కన్నడ నేలపై పుట్టి పెరిగి ఈ స్థాయికి ఎదిగిన యష్‌కూడా ఇటువంటి వివాదాస్పద సన్నివేశాలకి  ఎలా అంగీకారం తెలిపారని ఆమె సూటిగా ప్రశ్నించారు. రుషికా చేసిన ఈ కామెంట్స్ నెట్టింట ప్రత్యక్షమవ్వగానే క్షణాల్లో వైరల్‌గా మారి కన్నడ నాట పెను దుమారం రేపాయి.  

Also read:కరాటే కల్యాణి వ్యాఖ్యలు వైరల్: #పావలా శ్యామల కుమార్తె మాధవికి 'మా' సాయం అప్పటి వరకే 


అయితే, రుషికా సింగ్ చేసిన వ్యాఖ్యలపై యష్ అభిమానులు మరియు నెటిజన్లు అత్యంత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఆమెను టార్గెట్ చేస్తూ నెటిజన్లు ఎదురుదాడికి దిగారు. సినిమాలో నటిస్తున్న ప్రొఫెషనల్ నటీమణులు తమ సొంత సమ్మతితోనే ఆయా సన్నివేశాల్లో నటించారని, ఒక కల్పిత కథతో కూడిన చలనచిత్రంలో పాత్రలను చూసి నటుడి వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాన్ని ముడిపెట్టడం ఎంతవరకు న్యాయమని యష్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా, గతం లో రుషికా సింగ్ చేసిన బోల్డ్ ఫోటోషూట్లు, గ్లామరస్ సన్నివేశాల వీడియోలను రీషేర్ చేస్తూ ఆమె ద్వంద్వ ప్రమాణాలను ఎండగడుతున్నారు. ఆగస్టు 26న విడుదల కానున్న ఈ పాన్-ఇండియా చిత్రం చుట్టూ ముసురుకున్న ఈ రచ్చ రాబోయే రోజుల్లో ఏ మలుపు తిరుగుతుందోనని సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. కన్నడ పరిశ్రమలో సుప్రసిద్ధ దిగ్గజ దర్శకుడు రాజేంద్ర సింగ్ బాబు కుమార్తె అయిన రుషికా సింగ్, 'కళ్ళ మళ్ళ సుళ్ళ', 'బెంకి బిరుగాలి', 'కంఠీరవ' వంటి ప్రముఖ చిత్రాల ద్వారా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Yash, Toxic, Rishika Singh, Tollywood






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.