Home  »  News  »  చంద్రముఖి: హీరోలు, భాషలు మారేకొద్దీ అష్టవంకర్లు పోయిన అసలు కథ 

Updated : Aug 13, 2026

 


నేటికీ చిన్న పిల్లలు తమ తల్లిని సరదాగా భయపెట్టడానికి 'చంద్రముఖి' సినిమాలో రజినీకాంత్, జ్యోతిక పలికిన 'లక లక' అనే పదాన్ని ఉపయోగించడం ఆనవాయితీగా మారింది. అంతలా దక్షిణ భారతీయ సినీప్రేమికుల ఫేవరేట్ లిస్ట్ లో ఒకటిగా ఉంది. ఇప్పటికీ  ఈ సినిమా కథ,నటీనటుల క్యారక్టరయిజేషన్స్ గురించి మాట్లాడుకునే ఉంటారు. విజయవాడతో పాటు చాలా ఏరియాస్ లో కంటిన్యూగా వందరోజులు హౌస్ ఫుల్ తో ఆడిందంటే చంద్రముఖి సునామీని అర్ధం చేసుకోవచ్చు. 

1985లో, మలయాళంలో కుంకుమం అనే పత్రికలో ‘అస్వాతి తిరునాళ్’ అనే కలం పేరుతో ప్రచురితమైన ‘విజనవీధి’ నిర్మానుష్యమైన వీథి) అనే కథ ఉంది.పాత కోట , కథానాయిక డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్, దెయ్యం ఆవహించినట్టు జనం భ్రమపడటం, చివరకు ఓ మానసిక వైద్యుడు ఎలా చికిత్స చేస్తాడనేది మూలకథ. దాని ఆధారంగానే 1993లో మలయాళంలో'‘మణిచిత్రతాళు’ అనే సినిమా రూపొందింది… కాకపోతే ఈ సినిమా కథను మేమే రాసుకున్నామని సీనిమా టీమ్ చెప్పుకుంది… కొన్నాళ్లు కాపీ వివాదం నడిచింది… ఫాజిల్ దర్శకత్వంలో మోహన్‌లాల్, శోభన, సురేష్ గోపి నటించిన ఈ ‘మణిచిత్రతాళు’ (Manichitrathazhu) చిత్రం భారతీయ సైకలాజికల్ హారర్ చిత్రాలలో ఒక మైలురాయి. కేరళలోని ఒక పురాతన తరవాడు (ఉమ్మడి కుటుంబం ఇల్లు) నేపథ్యంలో సాగే కథ. అక్కడ దెయ్యం ఉందని నమ్మే ఆచారాలు, మానసిక సమస్య (డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్) కారణంగా ఒక పాత్ర ప్రవర్తించే తీరును శాస్త్రీయంగా, మానసిక వైద్యం కోణంలో ముగించిన విధానం దీని ప్రత్యేకత. ఇందులో శోభన అభినయం జాతీయ పురస్కారాన్ని గెలుచుకుంది.

ఇక 2005 లో తమిళంలో ఈ సినిమా ప్లాన్ చేశారు… రజినీకాంత్ హీరో… ఇక తను హీరో అనేసరికి రకరకాల వంకర్లు పోయింది కథ. అందులో రజినీకి తగ్గట్టుగా  కమర్షియల్ హంగులు వచ్చి చేరాయి… మరీ ప్రత్యేకంగా వడివేలుతో  కామెడీ ట్రాక్… ఫైట్లు, డాన్సులు, స్టెప్పులు, ఎలివేషన్లు, రజినీ మేనరిజమ్స్  ఎట్సెట్రా. మలయాళంలో మానసిక వైద్యుడైన డాక్టర్ సన్నీ (మోహన్‌లాల్) పాత్ర పరిమితంగా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ తమిళంలో రజనీకాంత్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని ఆ పాత్రను చాలా పవర్ ఫుల్‌గా, మాస్ ఎలిమెంట్స్, ఫ్లాష్‌బ్యాక్ పోరాట ఘట్టాలతో భారీగా మార్చారు. 2007 లో  హిందీలో రీమేక్ చేశారు… అక్షయ్ కుమార్ హీరో, ప్రియదర్శన్ దర్శకత్వం… ‘భూల్ భులయ్యా’ (Bhool Bhulaiyaa)… మళ్లీ నార్త్ ఇండియన్ ఆడియెన్స్ టేస్ట్ పేరిట కామెడీకి ఇంకాస్త పెద్దపీట వేశారు… అక్షయ్ కుమార్ పోషించిన డాక్టర్ పాత్రలోని పిచ్చి సరదాలు, రాజ్‌పాల్ యాదవ్ కామెడీ సినిమా వాతావరణాన్ని సీరియస్ టోన్ నుంచి ఓ లైటర్ వీన్ సబ్జెక్టుగా మార్చేశాయి.

Also Read: ఈ హీరోని చూసి సాక్షాత్తు #శ్రీరాముడే అన్నారు

చంద్రముఖి సీక్వెల్, నాగవల్లి, భూల్ భులయ్యా 2, 3 చిత్రాలు పూర్తిగా వేరే కథలతో వచ్చిన సీక్వెల్స్ కావడం గమనార్హం. వాటి గురించిన ప్రస్తావనే ఇక్కడ అనర్హం… మాతృక మణిచిత్రతాళు ఒక సహజమైన, కళాత్మకమైన సైకలాజికల్ థ్రిల్లర్ అయితే చంద్రముఖి, భూల్ భులయ్యాలు వంకర్లు పోయిన రీమేకులు… అసలు నవలతో పోలిస్తే, అసలు ఇవి ఆ కథతో రూపొందినవేనా అనే సందేహం ఆవరిస్తుంది. ఏది ఏమైనా చంద్రముఖి  ప్రపంచవ్యాప్తంగా దాదాపు 75 కోట్లకు పైగా వసూలు చేసి ఆ కాలంలో ఒక సంచలనం సృష్టించింది. ముఖ్యంగా తమిళనాడులోని శాంతి థియేటర్‌లో వరుసగా 890 రోజుల పాటు ప్రదర్శించబడి, అత్యధిక రోజులు ఆడిన తమిళ చిత్రంగా చరిత్రకెక్కింది. అయితే, వెండితెరపై మనం చూసిన ఈ భయంకరమైన కథ కేవలం ఒక దర్శకుని ఊహ మాత్రమేనా లేదా దీని వెనుక ఏదైనా నిజమైన సంఘటన ఉందా అనే ప్రశ్న చాలామంది మనస్సులలో మెదులుతూనే ఉంటుంది.

Rajinikanth, Jyothika, Prabhu,  Chandramukhi






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.