![]() |
![]() |

షకీలా..ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. జయం, నిజం వంటి చిత్రాలతో పాటు పలు చిత్రాల్లో తనదైన మేనరిజంతో అలరించింది. మలయాళంలో అయితే షకీలా సినిమాలు రిలీజైతే మోహన్ లాల్, మమ్మూట్టి లు తమ సినిమా రిలీజ్ ని వాయిదా వేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. దీన్ని బట్టి షకీలా ప్రభావాన్ని అర్ధం చేసుకోవచ్చు.
షకీలా తాజాగా తనకు ఎదురైన ఒక భయంకరమైన ఆరోగ్య సమస్యను, అందుకు దారితీసిన పరిస్థితులని బయటపెట్టి అందరినీ షాక్ కి గురిచేశారు. ఆమె మాట్లాడుతూ ' నిత్య జీవితంలో భాగమైపోయిన స్మార్ట్‌ఫోన్ నా జీవితంలో ఊహించని నరకాన్ని చూపించింది. అతిగా ఫోన్ వాడటం వల్ల ఏకంగా మెడకు శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన దుస్థితి వచ్చింది. సినిమా అవకాశాలు తగ్గి ఇంట్లోనే ఒంటరిగా ఉండిపోవడంతో, ఆ ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి స్మార్ట్‌ఫోన్‌ని ఒక వ్యసనంలా మార్చుకున్నాను. ప్రతిరోజూ మంచంపై ఒకే పక్కకు వంగి పడుకుని వరుసగా 4 గంటల కంటే ఎక్కువ సమయం మొబైల్లో గేమ్స్ ఆడటం అలవాటుగా మారింది. గేమ్ ఆడిన తర్వాత కాఫీ లేదా టీ తాగి వచ్చి, మళ్లీ అదే విధంగా యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో గంటల తరబడి రీల్స్, షార్ట్స్ చూడటంతో మెడలోని నరాలు తీవ్రంగా ఒత్తిడికి గురై దెబ్బతిన్నాయి.
Also read: ఓనం 2026 బాక్సాఫీస్ యుద్ధం: మలయాళంలో బాక్సాఫీస్ కింగ్ ఎవరు!
మెడ నొప్పి తారాస్థాయికి చేరడం, కాళ్లూ చేతులు కదల్చలేని పరిస్థితి రావడంతో వెంటనే చెన్నైలోని మేడ్వే ఆసుపత్రిలో జాయిన్ అయ్యాను. మెడ భాగంలో ఒక టైటానియం స్క్రూని అమర్చారు. ఆపరేషన్‌కి 3 లక్షల వరకు ఖర్చయింది. స్మార్ట్‌ఫోన్ అనేది అవసరమే అయినప్పటికీ పరిమితి దాటి వాడితే ప్రాణాల మీదికి తెస్తుంది. ముఖ్యంగా పిల్లలకి మొబైల్ ఫోన్లు ఇచ్చి అలవాటు చేయవద్దని తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంట్లోనే బెడ్ రెస్ట్‌లో ఉన్నారు. మెడకు ప్రత్యేకమైన నెక్ కాలర్ ధరించి రికవరీ అవుతున్న ఆమె, ప్రస్తుతం నడవడానికి, కనీసం భోజనం చేయడానికి, మంచం పైనుంచి లేవడానికి కూడా కేర్టేకర్ల సహాయంపై ఆధారపడుతున్నారు.
Shakeela, Cell Phone, Tollywood

![]() |
![]() |