Home  »  News  »  చిక్కుల్లో విక్రమ్: కోతిని ఆ విధంగా చేయడంతో తీవ్రమైన నేరంగా పరిగణింపు 

Updated : Aug 11, 2026

 

 

పాన్ ఇండియా అనే పదం ఒకటి ఉందని ప్రేక్షకులు, అభిమానులు తెలుసుకోలేని రోజుల్లోనే పాన్ ఇండియా వ్యాప్తంగా స్టార్ స్టేటస్ సంపాదించాడు విక్రమ్. అభిమానులు ముద్దుగా చియాన్ అని పిలుచుకుంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే విక్రమ్  , నిన్న  ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ లో ఒక వీడియో షేర్ చేశాడు. 


ఆ వీడియోలో విక్రమ్ ఒక ముద్దులొలికే ఒక కోతిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని, ఎంతో ఆప్యాయంగా ఆడుకుంటూ కనిపించారు. సుమారు 1 నిమిషం నిడివి ఉన్న ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. కేవలం కొన్ని గంటల్లోనే సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. అయితే, ఆ సరదా క్షణమే ఇప్పుడు ఆయనతో పాటు ఆయన బంధువులకు ఊహించని పెద్ద చిక్కులు తెచ్చిపెట్టింది.  ఈ వీడియో వైరల్ కాగానే వన్యప్రాణి సంరక్షణ నిపుణులు, పర్యావరణ వేత్తలు  స్పందించారు. వీడియోలో కనిపిస్తున్నది సాధారణమైన కోతి కాదని, అది అత్యంత అరుదైన 'లార్ గిబ్బన్' (Hylobates lar) అనే వన్యప్రాణి జాతికి చెందినదని వారు గుర్తించారు. ఈ 'లార్ గిబ్బన్' ప్రధానంగా ఆగ్నేయాసియా దట్టమైన వర్షారణ్యాల్లో జీవించే అరుదైన జీవి. ఇది అంతర్జాతీయంగా అత్యంత రక్షిత వన్యప్రాణుల జాబితా  CITES (సైట్స్) అపెండిక్స్-1 లో ఉంచబడింది. అలాగే భారతదేశపు వన్యప్రాణి సంరక్షణ చట్టం 2022 సవరణ ప్రకారం షెడ్యూల్-IV కింద రక్షణ పొందుతున్న ప్రమాదకరమైన స్థానంలో ఉన్న జీవిగా గుర్తింపు పొందింది. సాధారణంగా సుమారు 2 నుండి 3 సంవత్సరాల వయస్సు ఉన్న ఈ జీవులను ఇళ్లలో పెంపుడు జంతువులుగా ఉంచుకోవడం చట్టరీత్యా తీవ్రమైన నేరం.  విషయం తమిళనాడు అటవీ శాఖ అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు తక్షణమే విచారణకి  ఆదేశించారు. 


Also read: సోమవారం ఎంత రాబట్టాడో తెలుసా! #చిరు గెస్ట్ గా ఈ రోజు సక్సెస్ సెలబ్రేషన్స్ 


చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని ఇంజంబాక్కమ్ ప్రాంతంలో ఉన్న విక్రమ్ వియ్యంకుడు, ప్రముఖ క్యావిన్‌కేర్ (CavinKare) సంస్థ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సి.కె. రంగనాథన్ నివాసంలో ఈ వీడియో చిత్రీకరించినట్లు అధికారులు నిర్ధారించారు. జూన్ మాసంలో ఈ జీవిని మణిపూర్ నుంచి తమిళనాడులోని ఈరోడ్‌కు తీసుకువచ్చినట్లు సమాచారం లభించింది. అయితే, అంతరించిపోతున్న ఈ అరుదైన వన్యప్రాణిని ఇంట్లో ఉంచుకోవడానికి కావలసిన సరైన చట్టబద్ధమైన అనుమతి పత్రాలు లేదా క్లియరెన్స్ డాక్యుమెంట్లు రంగనాథన్ వద్ద లేవని చెన్నై వైల్డ్‌లైఫ్ వార్డెన్ కులాల్ యోగేష్ విలాస్ ప్రాథమికంగా గుర్తించారు.  పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న విక్రమ్, వీడియో పోస్ట్ చేసిన 24 గంటల వ్యవధిలోనే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి డిలీట్ చేశాడు.

 

వీడియో డిలీట్ అయినప్పటికీ, వన్యప్రాణి అక్రమ రవాణా, అనుమతులు లేకపోవడం అనే అంశాలపై అటవీ శాఖ అధికారులు తమ విచారణని  వేగవంతం చేశారు. సెలబ్రిటీలు ఇటువంటి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల ఇల్లీగల్ వైల్డ్‌లైఫ్ ట్రేడ్‌కు అనుకోకుండా ప్రోత్సాహం లభిస్తుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వన్యప్రాణులను ఇళ్లల్లో కాకుండా వాటి సహజ ఆవాసాలైన అడవుల్లోనే స్వేచ్ఛగా బతకనివ్వాలని వారు స్పష్టం చేస్తున్నారు.

Vikram, Kollywood
       






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.