Home  »  News  »  రౌండ్ అప్.. పవన్ పై మహేష్ ట్వీట్ తో సరికొత్త చర్చ 

Updated : Aug 11, 2026

 


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈ ఇద్దర్ని చూసి తెలుగు సినిమా ఎప్పటికప్పుడు గర్వంతో ఊగిపోతూ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పుడు వచ్చాము కాదన్నాయ్, బులెట్ దిగిందా లేదా అనే రీతిలో అనేక రికార్డ్స్ కి మెయిన్ పిల్లర్స్. సినిమాలకి సంబంధం లేకుండా వ్యక్తిగతంగా ఈ ఇద్దరి మధ్య ఉండే అనుబంధం, ఒకరిపట్ల ఒకరికి ఉన్న పరస్పర గౌరవం మాత్రం ఎల్లప్పుడూ ఎంతో ప్రత్యేకమైనదిగా నిలుస్తుంది.

మహేష్ బాబు మొన్న అగస్ట్ 9 న తన పుట్టిన రోజుని జరుపుకున్న విషయం తెలిసిందే. దీంతో   పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా 'తెలుగు చలన చిత్రసీమలో తనదైన పంథా కలిగిన అగ్రశ్రేణి కథానాయకుడు మహేష్. కథానాయకుడిగా అందుకున్న ఘన విజయాలు తెలుగు సినీ పరిశ్రమ వృద్ధికి ఎంతో దోహదపడ్డాయి. తండ్రి నటశేఖర కృష్ణ గారి అడుగుజాడల్లో వెళ్తూ.. విభిన్న పాత్రల్లో మెప్పించే అభినయ సామర్థ్యం ఆయన సొంతం. సోదర సమానుడైన మహేష్ బాబు మరిన్ని విజయాలు అందుకోవాలని, సంపూర్ణ ఆనందంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

Also read: గూఢచారి 116 కి 60 ఏళ్ళు..సృష్టించిన సంచలనం ఇదే


పవన్ చేసిన ట్వీట్ పై మహేష్ స్పందిస్తు  ‘మీ హృదయపూర్వక శుభాకాంక్షలకి  ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా నుండి మీకు అపారమైన ప్రేమ ఎల్లప్పుడూ  ఉంటుంది. మీకు మరింత పవర్ చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ  రిప్లై ఇచ్చాడు. ఇప్పుడు ఈ రెండు పోస్ట్ లు సోషల్ మీడియాని రౌండ్ అప్ చేసాయి.

Pawan Kalyan, Mahesh Babu, Tollywood






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.