Home  »  News  »  పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఈనాడు యాజమాన్యం గుడ్ న్యూస్.. చరిత్రలో ఇదే ఫస్ట్ టైం 

Updated : Jul 21, 2026


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే పేరుకి ఉన్న ప్రభంజనం గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పని లేదు. కట్ అవుట్ కనపడితే చాలు పూలదండలు, బాణా సంచా పేలుళ్లతో రచ్చ రచ్చ చేయడం అభిమానులు తమ కర్తవ్యంగా భావిస్తారు. ఇప్పుడు ఆ అభిమానులకి, ప్రేక్షకులకి ఈటీవీ యాజమాన్యం ఒక తీపి కబురు తీసుకొచ్చింది.

స్టైలిస్ట్  డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన  మోస్ట్ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'ఓజీ' (They Call Him OG) ఇప్పుడు బుల్లితెరపై సంచలనం సృష్టించడానికి సిద్ధమైంది. థియేటర్లలో కాసుల వర్షం కురిపించి, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సరికొత్త రికార్డులను తిరగరాసిన ఈ గ్యాంగ్‌స్టర్ విజువల్ వండర్, త్వరలోనే ప్రతిఒక్కరి ఇంట్లోని బుల్లితెరపై ప్రసారం కానుంది. 'ఓజీ'  శాటిలైట్ (టెలివిజన్) హక్కులని ప్రముఖ  ఛానల్ 'ఈటీవీ' (ETV) అత్యంత భారీ ఫ్యాన్సీ రేటుకి దక్కించుకుంది. బుల్లితెరపై ఈ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ త్వరలోనే ప్రసారం కానుందంటూ ఈటీవీ యాజమాన్యం ఇప్పటికే అధికారికంగా పవర్‌ఫుల్ ప్రోమోలని  విడుదల చేసింది. ఫిల్మ్‌నగర్ వర్గాల ప్రకారం... రాబోయే ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ శుభసందర్భంగా ఈ గ్రాండ్ ప్రీమియర్‌ను ప్రసారం చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. అంతేకాకుండా, ఆగస్టు 28న రాఖీ పండగ కానుకగా ఈ చిత్రాన్ని మరోసారి బుల్లితెరపై రీ టెలికాస్ట్ చేయాలని ఛానల్ ప్లాన్ చేస్తోంది.

గత ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైన 'ఓజీ' చిత్రం తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించింది. పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ ప్రెజెన్స్, సుజీత్ విజనరీ టేకింగ్, తమన్ హై-వోల్టేజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఫలితంగా ఈ చిత్రం బాక్సాఫీస్ బరిలో 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి, టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలో సైతం మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో గ్లోబల్‌గా ట్రెండ్ అయిన ఈ చిత్రం, థియేటర్లలో విడుదలైన దాదాపు 10 నెలల తర్వాత బుల్లితెర ప్రేక్షకులని  పలకరించబోతోంది.

Also read: ఏంటి బాబు తెలుగు నాట ఈ థియేటర్స్.. రచ్చ రచ్చ ఖాయమా! 

పవన్ సరసన ప్రియాంకా అరుల్ మోహన్ కథానాయికగా అలరించగా, బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రధాన విలన్‌గా పవర్‌ఫుల్ రోల్‌లో మెప్పించారు. వీరితో పాటు ప్రకాష్ రాజ్, శ్రేయా రెడ్డి, అర్జున్ దాస్ తదితర ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. తమన్ అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఎసెట్.. ఇక ఈటీవీ చరిత్రలో మొట్టమొదటి సారిగా ఒక బడా మూవీ రైట్స్ కొని టెలికాస్ట్ చెయ్యడం అనేది ఇదే ఫస్ట్ టైం.

 

pawan kalyan,og, priyanka mohan, sujeeth, danayya, etv






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.