Home  »  News  »  Chiranjeevi: చిరంజీవిపై మురళీ మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు 

Updated : Jun 30, 2026

మురళీ మోహన్(Murali Mohan).. తెలుగు సినిమాకి దొరికిన అపురూపమైన వజ్రం లాంటి నటుడు. హీరోగా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, ప్రొడ్యూసర్ గా మురళీ మోహన్ సృష్టించిన ప్రభంజనం తెలుగు సినిమా ఉన్నంత కాలం పదిలం. చాలా లేటుగా కేంద్ర ప్రభుత్వం  కొన్ని రోజుల క్రితం  పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ ప్రయాణం, ఆరోగ్యం, వ్యక్తిగత విశేషాలతో పాటు మెగాస్టార్ చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. అయన మాట్లాడుతు  నాకు పద్మశ్రీ అవార్డు వచ్చినట్లు తెలిసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి స్వయంగా నా  ఇంటికి వచ్చి శుభాకాంక్షలు తెలియజేయడం నన్ను ఎంతగానో కదిలించింది. ఆ క్షణంలో చిరంజీవి చూపించిన నమ్రత, గౌరవం చూస్తుంటే కుచేలుడు కృష్ణుడి దగ్గరికి వచ్చినట్టు అనిపించింది. ఈ విషయాన్నే చిరంజీవితో చెప్పాను. అప్పుడు నాతో చిరంజీవి 'మీరు నాకు మాస్టర్ అనుకొని వచ్చాను అని సమాధానం ఇవ్వడం చిరంజీవి వ్యక్తిత్వానికి నిదర్శనం. ఇప్పటికి నన్ను అన్నయ్య అని పిలుస్తాడు. ఆ పేరు ఇప్పటికీ కొనసాగుతోంది. చిరంజీవి లాంటి వ్యక్తిత్వం, వినయం ఉన్న మరో హీరో ఇండస్ట్రీలో ఉండరు

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తొలి రోజుల్లోని ఒక ఆసక్తికరమైన జ్ఞాపకాన్ని మురళీ మోహన్ గుర్తుచేసుకున్నారు. చిరంజీవి మొదటి చిత్రం 'మన ఊరి పాండవులు' షూటింగ్ రాజమండ్రి పరిసరాల్లోని ఒడ్డూరులో జరుగుతున్న సమయంలో, మురళీ మోహన్ అప్పటికే పరిశ్రమలో పెద్ద స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఆ సమయంలో చిరంజీవి, ప్రసాద్ బాబు, భానుచందర్ వంటి వారు సరికొత్తగా పరిశ్రమలోకి అడుగుపెడుతున్న నటులు. ఒకరోజు షూటింగ్ విరామంలో చిరంజీవి చాలా అమాయకంగా మురళీ మోహన్ దగ్గరకు వచ్చి, "అన్నయ్య, నాకు కూడా భవిష్యత్తులో సక్సెస్ అయితే మీలాగే ఇంత పెద్ద పేరు వస్తుందా?" అని అడిగారట. దానికి మురళీ మోహన్ ఏమాత్రం తడుముకోకుండా, చిరంజీవిలో ఉన్న అసాధారణ ప్రతిభని  గుర్తించి ఒక అద్భుతమైన జోస్యం చెప్పారు.

Also read: దయచేసి ఇంకెప్పుడు అడుక్కోకు నాన్న.. అక్కా,చెల్లెళ్ళ అసలు కథ ఏంటి!

మురళీ మోహన్ ఆనాడు చిరంజీవితో 'మా అందరి కంటే మించిన నైపుణ్యం నీలో దాగుంది. నీ బాడీలో విపరీతమైన ఈజ్ ఉంది. ఎలాంటి మ్యూజిక్ ప్లే చేసినా ఏ రిహార్సల్స్ లేకుండానే అద్భుతంగా డాన్స్ చేసేయగలవు. నీ శరీరంలో అంత ఫ్లెక్సిబిలిటీ ఉంది. అంతేకాదు, నీ కళ్లు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. నువ్వు అలా ఎక్స్ప్రెషన్ ఇస్తే అవతలి వాడు భయపడిపోయే అంత పవర్ ఆ కళ్లల్లో ఉంది. ఈ విధంగా ఎటు చూసుకున్నా నువ్వు రాబోయే రోజుల్లో చాలా పెద్ద హీరో అవుతావు. ఈ పరిశ్రమకి  మొగుడు అవుతావు" అని అన్నారట. కాలక్రమేణా ఆ మాటలు అక్షరాలా నిజమయ్యాయని, చిరంజీవి టాలీవుడ్‌ను శాసించే మెగాస్టార్‌గా ఎదిగారని ఆయన సగర్వంగా ప్రకటించారు. చిరంజీవి రాకతో తెలుగు సినిమా డ్యాన్స్, ఫైట్స్ చరిత్రే మారిపోయిందని, అంతకుముందు డూప్‌లతో నడిపించే రిస్క్ షాట్లను చిరంజీవి  స్వయంగా చేసి ఒక సరికొత్త ట్రెండ్‌ సెట్ చేశారని అభినందించారు. చిరంజీవి, మురళీ మోహన్ అన్న, తమ్ముడుగా చేసిన గ్యాంగ్ లీడర్ సాధించిన ఘన విజయం తెలిసిందే. ఆ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సీన్స్ కోసమే గ్యాంగ్ లీడర్ చూసిన వాళ్ళు ఎంతో మంది.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.