![]() |
![]() |

తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో సమానమైన ఫాలోయింగ్ కలిగిన హీరో విశాల్. తన అప్ కమింగ్ మూవీ 'మకుటం' పై అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు కూడా తనే. ఇటీవల సాంగ్ లాంచ్ ఈవెంట్‌ని చిత్ర యూనిట్ ఎంతో ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో పాల్గొన్న హీరో విశాల్ తన సినీ కెరీర్, అలాగే దర్శకుడిగా మారాలనే తన బలమైన కోరిక వెనుక ఉన్న అసలు రహస్యాన్ని బయటపెట్టారు.
విశాల్ మాట్లాడుతూ, టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సృష్టించిన ట్రెండ్ సెట్టర్ మూవీ 'శివ' నా జీవితాన్ని మలుపు తిప్పింది. కింగ్ అక్కినేని నాగార్జునలా ప్రతి ఒక్క యువకుడు కాలేజీ రోజుల్లో సైకిల్ చైన్ చేతికి చుట్టుకుని తిరిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే, నేను మాత్రం శివ చూసి ఒక సామాన్య ప్రేక్షకుడిగా కాకుండా, ఒక భావి దర్శకుడిగా ఆలోచించడం ప్రారంభించాను. మేకింగ్ స్టైల్, యాక్షన్ సీక్వెన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, క్యారెక్టరైజేషన్ నన్ను ఎంతగానో కట్టిపడేశాయి. ఆ రోజే ఒకరోజు మెగాఫోన్ పట్టి డైరెక్టర్ అవ్వాలని బలంగా ఫిక్సయినట్లు మనసులోని మాటను పంచుకున్నారు.
Also read: Maa inti bangaram: ఎన్టీఆర్ తో చెయ్యడం నా డ్రీమ్.. మా ఇంటి బంగారం కిరణ్మయి వైరల్ స్పీచ్
ప్రస్తుతం విశాల్ తెరకెక్కిస్తున్న 'మకుటం' సినిమా విషయానికి వస్తే, ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ గ్లింప్స్ మూవీపై క్యూరియాసిటీని పెంచేసాయి. టీజర్‌లో మండుతున్న శవం నుంచి హీరో సిగరెట్ వెలిగించుకుంటూ మాస్ ఎంట్రీ ఇచ్చే సీన్ చూసి అభిమానులు థియేటర్లలో పూనకాలు గ్యారెంటీ అని ఫిక్సవుతున్నారు. విశాల్ ఏకంగా మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న గెటప్స్‌లో కనిపించి విశ్వరూపం చూపించబోతున్నారు. అలాగే టాలెంటెడ్ నటి అంజలి ఈ చిత్రంలో మునుపెన్నడూ చూడని ఒక పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ అవతార్‌లో కనిపించనుండటం విశేషం.

![]() |
![]() |