![]() |
![]() |

సూర్య(Suriya)ప్లాపుల పరంపరకి మంగళం పలికిన మూవీ కరుప్పు అలియాస్ వీరభద్రుడు. ఎంటైర్ సూర్య కెరీర్ లోనే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా సుమారు 340 కోట్ల రూపాయల భారీ వసూళ్లతో దూసుకెళ్లింది. కేవలం తమిళనాడులోనే ఏకంగా 191 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించి, సూర్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా నిలవడం ఒక అద్భుతమనే చెప్పాలి.
ఈ బ్లాక్‌బస్టర్ విజయం ఇచ్చిన జోష్‌తో సూర్య 'విశ్వనాధ్ అండ్ సన్స్' చేస్తున్న విషయం తెలిసిందే. ఆగష్టు 14 న రిలీజ్ కాబోతుండగా వెంకీ అట్లూరి దర్శకుడు. ఇప్పుడు ఈ మూవీలో సూర్య ఒక సాంగ్ పాడబోతున్నాడు రికార్డింగ్ థియేటర్ లో సూర్యతో పాటు వెంకీ, మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కలిసి ఉన్న పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక సూర్య ఫ్యాన్స్ అయితే సూర్య గళం నుంచి వచ్చిన సాంగ్ కి పూనకాలతో ఊగిపోవడం ఖాయం.
Also read: lenin: లెనిన్ ట్రైలర్ రిలీజ్ రేపే.. ఆ నగరంలో అక్కినేని అభిమానుల మధ్య భారీ ఈవెంట్
సితార ఎంటర్ టైన్ మెంట్ నిర్మిస్తున్నవిశ్వనాధ్ అండ్ సన్స్ లో మమితా భైజు హీరోయిన్. ప్రచార చిత్రాలతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

![]() |
![]() |